
Drug Cases In Kerala: ఏమోయ్ మోడీ… నీకు పాలించడం రాదు. ఆ చైనా ను చూసి నేర్చుకో…లేదా నన్ను చూసయినా నేర్చుకో. అని వీర లెవల్లో ప్రసంగాలు దంచుతాడు..తెలంగాణ కు వచ్చి కేసీఆర్ కు బద్దలు కడతాడు.తాను మాత్రం గోల్డ్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటాడు.. కృష్ణ తేజ లాంటి ఐఏఎస్ అధికారి బట్టలు ఇప్పి బజార్ లో నిలబెడుతున్నా కించిత్ కూడా సిగ్గు పడడు. ఇంతా ఎందుకు చెబుతున్నామయ్యా అంటే… ప్రగతి శీల రాష్ట్రమని ఆ సూది, దబ్బుణం పార్టీలు పదే పదే డప్పు కొడతాయి కదా! ఇప్పుడు ఆరాష్ట్రంలో యువత దారి తప్పింది. సేమ్ ఆ ఉడ్తా పంజాబ్ లాగా మత్తులో జోగుతోంది..స్కూల్ బ్యాగ్ లు, డెస్క్ ల్లో డ్రగ్స్ ప్యాకెట్లు దాచి ఆ ఉన్మత్త లోకం లో విహరిస్తోంది.
Also Read: CM KCR : నిండు సభలో కేసీఆర్ పిట్టకథ.. నవ్వలేక చచ్చిన ఎమ్మెల్యేలు
ఆ మధ్య సెంట్రల్ కేరళలోని ఓ పట్టణం లో ఓ యువతి ఓ లాడ్జ్ లో డ్రగ్స్ తీసుకుని ఆ చేతనంగా పడి పోయింది. పోలీసులు రైడ్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కానీ మత్తు లో ఉన్న ఆ యువతి వారి మీద అరవడం మొదలు పెట్టింది.. ఆ యువతి ఒకప్పుడు చదువులో టాపర్. కానీ తన భాయ్ ఫ్రెండ్ అలవాటు చేయడంతో బానిస గా మారింది.. చదువుకుని ఉన్నత స్థాయి లో స్థిర పడాల్సిన ఆమె డ్రగ్స్ పెడ్లర్ గా మారింది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ ఆమెను లైంగికంగా వాడుకోవడమే కాకుండా మత్తు పదార్థాలకు బానిస చేశాడు. ఈ మత్తు పదార్థాలకు బానిసలయిన 21 ఏళ్ల లోపు వారి పై పోలీసులు ఓ సర్వే చేయగా…అందులో 40 శాతం 18 ఏళ్ల లోపు పిల్లలే ఉన్నారు. ఇందులో బాలికల శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరు మత్తు ఉచ్చు లో చిక్కుకున్నాక సరఫరా దారులుగా మారుతున్నారు. గతం లో ఈ కేసులు కాలేజీల్లో నమోదయ్యేవి. ఇప్పుడు స్కూళ్ళలోనూ గుర్తి స్తున్నారు.

చాలా సందర్భాల్లో అబ్బాయిలు వారి గర్ల్ ఫ్రెండ్స్ ను ఊబిలోకి దింపుతున్నారు. తర్వాత వారిని మత్తుకి బానిసలు చేసి లైంగికంగా వాడుకుంటున్నారు. కేరళ పాఠశాలల పరిధిలో చిన్న చిన్న తినుబండారాల దుకాణాల పై పోలీసులు 18 వేల దాడులు చేసి, 401 కేసులు నమోదు చేశారు. 462 మందిని అరెస్ట్ చేశారు. 20.97 కిలోల గంజాయి, 186.38 గ్రాముల ఎండీఎంఏ, 1,122 గ్రాముల హాషిశ్ ను సీజ్ చేశారు. మత్తుకు బానిసలయిన పిల్లలు డెస్క్ లు, స్కూల్ బ్యాగ్ లలో డ్రగ్స్ ప్యాకెట్ లు దాస్తున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా నార్కోటిక్ డ్రగ్స్,మాదక ద్రవ్యాల వినియోగం కేసులు, అరెస్ట్ అయిన వారి సంఖ్య 5 రెట్లు పెరిగింది అంటే పరిస్థితి ని అర్థం చేసుకోవచ్చు. అయితే పోలీసులు, ఎక్సైజ్ శాఖ ల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేశారు. అన్నట్టు ఈ డ్రగ్స్ కేసులో అధికార పార్టీ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే కమ్యునిస్టుల పాలనలో కేరళ ఈ రూపం లో ప్రగతి శీలంగా దూసుకుపోతోందన్న మాట.
Also Read:Ustad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో అల్లు అర్జున్ కూతురు ఖరారు అయ్యినట్టే!