
Dasara Movie First Review: న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియన్ స్కేల్ లో చేసిన చిత్రం ‘దసరా’.మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊర నాటు మాస్ సినిమాలకు మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే.ఈమధ్య వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి.ఇప్పుడు నాని కూడా అదే దారిలో వెళ్తున్నాడు.సింగరేణి బొగ్గు కార్మికుల చుట్టూ తిరిగే కథ తో, ఆయన ఈ నెల 30 వ తారీఖున మన ముందుకి రాబోతున్నాడు.
ఇప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.నాని ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడు అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది.నాని మాటల్లో కూడా ఈ సినిమా మరో ‘కాంతారా’ రేంజ్ సెన్సేషన్ అవుతుందనే నమ్మకం బాగా కనిపిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కి మరియు కొంతమంది సినీ ప్రముఖులకు ఈ సినిమాని వేసి చూపించారట.ఈ చిత్రం చూసిన తర్వాత వాళ్ళ నోటి నుండి మాట రాలేకపోయిందట.ఇది కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ సెన్సేషన్ సృష్టించే సినిమా అని, నాని నటనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు చేతెలెత్తి దండం పెడతారని, ఆయనలో ఇంత ఊర నాటు మాస్ ని మేమెవ్వరం ఊహించలేదని, ముందు నుండి ఈ చిత్రం మీద మాకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో, ఆ అంచనాలకు మించి ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని వాళ్ళు నాని కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారట.ఇదంతా వింటూ ఉంటే వెంటనే సినిమా చూసేయాలని అనిపిస్తుంది కదూ! కానీ అందుకోసం మరో 20 రోజులు వేచి చూడాల్సిందే.
