Subbu Movie Heroine: స్టూడెంట్ నెంబర్ 1 వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన చిత్రం ‘సుబ్బు’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమాలోని పాటలు మరియు కథనం బాగానే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాస్ ఇమేజి కి సెట్ అవ్వకపోవడం తో సినిమా ఫ్లాప్ గా నిల్చింది. ఈ చిత్రం ఎన్టీఆర్ పాత్ర కి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో హీరోయిన్ పాత్రకి కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది.
ఇందులో హీరోయిన్ గా సోనాలి జోషి నటించింది. ఇది ఆమెకి టాలీవుడ్ లో మొదటి సినిమా అయ్యినప్పటికీ కూడా మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్దగా ఈ సినిమా లో ఆమె గ్లామర్ షో చేయనప్పటికీ కూడా ఎవరీ అమ్మాయి ఇంత చక్కగా ఉంది అని అనిపించేలా చేసింది. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఇప్పటికీ ఆమెని మనం గుర్తు పెట్టుకున్నాము.
ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, ఒక్కటి కూడా మంచి గుర్తింపు ని మాత్రం తీసుకొని రాలేకపోయాయి.బహుశా సుబ్బు సినిమా సూపర్ హిట్ అయ్యుంటే ఈమెకి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కి ఉండేది ఏమో. సుబ్బు తర్వాత ఈమె చేసిన రెండవ చిత్రం ‘సందడే సందడి’ 2002 వ సంవత్సరం లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం హీరోలు మరియు మెయిన్ హీరోయిన్లకు దక్కడం తో సోనాలి జోషి ని ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఫలితంగా ఆ సినిమా హిట్ అయ్యినప్పటికీ కూడా సోనాలి కి గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత అన్నీ బీ గ్రేడ్ సినిమాలే ఈమెని వరించాయి, ఫలితంగా బీ గ్రేడ్ హీరోయిన్ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉండగా ఈమె సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది, ఆమెకి సంబంధించిన లేటెస్ట్ హాట్ ఫోటోలు మరియు వీడియోలు కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.