Cheers: ప్రపంచంలో మందు తాగే వారే ఎక్కువ ఉన్నారు. తాగని వారు తక్కువే. కానీ మందు తాగేవారిలో జోష్ వేరేలా ఉంటుంది. వారిలో ఉత్సాహం ఉరకలేస్తుంది సాయంత్రం అయిందంటే చాలు గ్లాస్ పట్టాల్సిందే. అందరు గ్లాస్ మేట్స్ కావాల్సిందే. పసందైన మందును నోట్లో పోసుకుని హాయిగా విహరించేందుకే మొగ్గు చూపుతుంటారు. దీంతో మందుబాబులు సరదాగా చెప్పుకునే పదం చీర్స్. అది చెప్పకపోతే మందు తాగడం మొదలుపెట్టరు. అందుకే మందు తాగే ముందు అందరు చీర్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు.

అసలు చీర్స్ అనే పదం ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఎందుకు ఈ పదాన్ని వాడతారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చీర్స్ అనే పదం పాత ఫ్రెంచ్ పదం. చియర్ నుంచి వచ్చింది. దీని అర్థం తల. 18వ శతాబ్ధం వరకు చియర్ అనే పదాన్ని ఆనందం కోసం వాడేవారు. ఉత్సాహాన్ని వర్ణించే పదంగా చూశారు. మందు తాగే ముందు అందరు చీర్స్ అని ఉత్సాహంగా చెబుతుంటారు. జాయ్ ఫుల్ గా ఉండటమని అర్థం. దీని వెనుక ఇంకో అర్థం కూడా ఉందని తెలుస్తోంది.
చీర్స్ కొట్టేటప్పుడు గ్లాసులన్ని ఒకే దగ్గరకు రావడంతో అందులో నుంచి ఒక్కో చుక్క కింద పడుతుంది. ఇలా ఏవైనా ఆత్మలుంటే వాటికి మొక్కేందుకు కూడా చీర్స్ ఉపయోగపడుతుందని ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. గ్లాసుల శబ్దం వినగానే అక్కడేమైనా దుష్టశక్తి ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. అందుకే మందు తాగే ప్రారంభంలో చీర్స్ కొట్టి స్టార్ట్ చేయడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అందరు దీన్ని ఫాలో అవుతున్నారు.

ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉండటం గమనార్హం. మద్యం తాగేటప్పుడు కళ్లతో గ్లాసును చూస్తాం. చర్మంతో తాకుతాం. ముక్కుతో వాసన చూస్తాం. నాలుకతో రుచి ఆస్వాదిస్తాం. కానీ చెవులకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో చీర్స్ కొడితే ఆ పదం చెవులకు సోకి అవి కూడా పని చేయడం ప్రారంభిస్తాయి. అందుకే చెవుల కోసమే చీర్స్ కొడతారని మరో వాదన ప్రచారంలో ఉంది. ఆ లోపాన్ని పూడ్చడానికే చెవులకు వినబడేలా చీర్స్ కొడతారని చెబుతుంటారు. మొత్తానికి చీర్స్ మీద భలే కథలు ప్రచారంలో ఉండటం తెలిసిందే.
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0
