Star Hero :  అప్పటి ఈ కుర్రాడు.. ఇప్పుడు స్టార్.. ఎవరో తెలుసా?

Star Hero : అందం ఆడోళ్లకే సొంతం కాదు అన్నట్లు.. కొందరు హీరోలు తమ బ్యూటీనెస్ తో అమ్మాయిలకు పిచ్చెక్కిస్తున్నారు. మంచి శరీరాకృతితో పాటు ఆకట్టుకునే ఫేస్ కట్ ఉన్న వారికి గర్ల్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతోంది. సినిమాల్లో, టీవీల్లో వీరు కనిపిస్తే చాలు తెరముందు వాలిపోతుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న వారిలో ఓ హీరోకు లేడీ ఫ్యాన్స్ లెక్కలేనంత ఉంది. ఆయన నటించింది బుల్లితెరపైనే అయినా సాయంత్రం ఆయనను చూసేందుకు యువతులు, మహిళలు ఆసక్తి చూపుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : April 8, 2023 9:08 am
Follow us on


Star Hero :
అందం ఆడోళ్లకే సొంతం కాదు అన్నట్లు.. కొందరు హీరోలు తమ బ్యూటీనెస్ తో అమ్మాయిలకు పిచ్చెక్కిస్తున్నారు. మంచి శరీరాకృతితో పాటు ఆకట్టుకునే ఫేస్ కట్ ఉన్న వారికి గర్ల్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతోంది. సినిమాల్లో, టీవీల్లో వీరు కనిపిస్తే చాలు తెరముందు వాలిపోతుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న వారిలో ఓ హీరోకు లేడీ ఫ్యాన్స్ లెక్కలేనంత ఉంది. ఆయన నటించింది బుల్లితెరపైనే అయినా సాయంత్రం ఆయనను చూసేందుకు యువతులు, మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అందంతో పాటు ఆకర్షణీయంగా నటించే ఈయన గురించి బుల్లితెర ఇండస్ట్రీలో నిత్యం చర్చ సాగుతూనే ఉంటుంది. అయితే లేటేస్టుగా ఈ హీరోకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిన్న సైకిల్ పై చిరునవ్వులు చిందిస్తున్న పై ఫొటోలోని బుడ్డోడు చాలా అందంగా ఉన్నాడు. ఈయన అందం పెద్దయ్యాక కూడా అలాగే ఉంది. ఇప్పుడాయన అమ్మాయిల ఆరాధ్య హీరోగా కొనసాగుతూ ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ ఎవరా అని అనుకుంటున్నారా..? ఆయన పేరు రిషి అలియాస్ రిషేంద్ర భూషణ్. రిషి గురించి సాధారణ వ్యక్తులకు తెలియకపోవచ్చు. కానీ టీవీ సీరియల్ చూసేవారికి ఈయన ఫేవరేట్ హీరో. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా ఆకట్టుకుంటున్న ఈయన ప్రస్తుతం బిజీ నటుడిగా మారిపోయాడు.

రిషేంద్ర భూషణ్ కన్నడ నటుడు. చిన్నప్పటి నుంచే అందం ఈయన సొంతం. అందంగా ఉన్నావ్ సినిమాల్లో ట్రై చేయాలని చాలా మంది ఫోర్స్ చేసేవారు. కానీ సినిమాల్లో ఉన్న పోటీ కారణంగా ఆయన ఇండస్ట్రీ వైపు చూడలేదు. అయితే తన చదువంతా పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను గెలుచుకున్నాడు. ఆ తరువాత అతనికి సీరియల్ లో నటించాలనే ఆఫర్ వచ్చింది. అలా మొదటిసారి ‘నాగ కన్నిక’ అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సీరియల్ సక్సెస్ తరువాత రిషికి ఆఫర్లు పెరిగాయి. ముఖ్యంగా తెలుగు నుంచి ఆయనకు అవకాశాలు రావడంతో ఏమాత్రం నో చెప్పకుండా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ‘ప్రేమ్ నగర్’ సీరియల్ ద్వారా తెలుగు సీరియళ్లలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదట్లో ఈయనను ఒక్కడి ప్రేక్షకులు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ‘గుప్పెడంత మనసు’ సిరియల్ లో నటించిన తరువాత రిషికి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్ లో రిషి నటనకు మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందంతో పాటు నటనతో ఆయన ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. దీంతో ప్రతిరోజూ ఆయనను టీవీలో చూడకుండా ఉండని ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు.