Homeఎంటర్టైన్మెంట్Anchor Swapna Marriage: 47 ఏళ్ల వయసులో యాంకర్ స్వప్న ఎవరిని పెళ్లి చేసుకుందో...

Anchor Swapna Marriage: 47 ఏళ్ల వయసులో యాంకర్ స్వప్న ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా? షాకింగ్ పిక్ వైరల్

Anchor Swapna Marriage
Anchor Swapna Marriage

Anchor Swapna Marriage: స్వప్న… బహుశా తెలుగు మీడియాలో ఈ పేరంటే తెలియని వాళ్ళు ఉండరు. రవి ప్రకాష్ టీవీ నైన్ ప్రారంభించిన తొలినాళ్లల్లో అందులో చేరింది. తన వాగ్దాటితో మంచి పేరు తెచ్చుకుంది. అనతి కాలంలోనే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పేరు తెచ్చుకుంది.. కాంట్రవర్షల్ అంశాల జోలికి వెళ్లే స్వప్న.. ఒక సెక్షన్ ఆగ్రహానికి కూడా గురైంది. ముఖ్యంగా హైదరాబాద్ బాంబు పేలుళ్లు జరిగినప్పుడు ఆమె ప్రాణాలకు తెగించి చేసిన రిపోర్టింగ్ ఇప్పటికి జర్నలిజం సర్కిల్లో మార్మోగుతూనే ఉంటుంది.. ఆమె పనితీరును గుర్తించి అప్పట్లో లాడ్లీ సంస్థ అవార్డులు కూడా ఇచ్చింది.

Also Read: Prabhas- NTR: ఎన్టీఆర్ కోసం ప్రభాస్… ఇక బాక్సాఫీస్ బద్దలే!

సాక్షిలోకి..

టీవీ9 లో 9 సంవత్సరాల పాటు పనిచేసిన స్వప్న తర్వాత వైఎస్ భారతి ఆహ్వానం మేరకు సాక్షిలో చేరారు. అందులో విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలను జనాలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగారు.. దీని తర్వాత ఆమె తీరును గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో కీలక పోస్టు కట్టబెట్టారు.. ఇదే కాకుండా ఓ ఎఫ్ ఎం ఛానల్లో రేడియో జాకీ గా కూడా స్వప్న పని చేసింది.. ఐ డ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా పనిచేసింది. అప్పట్లో ఈ ఛానల్ లో రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ సంచలనం రేకెత్తించింది.. రాంగోపాల్ వర్మను ఎవరూ అడగని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టింది. అంతేకాకుండా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, కీ, నానీ గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లో చిన్న చిన్న కామియోలు పోషించింది.

Anchor Swapna Marriage
Anchor Swapna Marriage

డాక్టర్ తో పెళ్ళి విడాకులు

ప్రొఫెషన్ పరంగా ఎత్తులు చూసిన స్వప్న, వ్యక్తిగత జీవితంలో అన్ని పల్లాలు ఎదుర్కొంది. టీవీ9 లో ఉన్నప్పుడే తాను ఒక డాక్టర్ను పెళ్లి చేసుకుంది. తర్వాత కొంతకాలానికే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సినీ నటుడుతో కొంతకాలం సహజీవనం చేస్తుందని వార్తలు వచ్చాయి.. తర్వాత అవి ఊహాగానాలే అని తేలిపోయాయి.. తాజాగా 47 ఏళ్ల వయసులో తను మళ్లీ పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి.. అయితే అతగాడు అమెరికాలో స్థిరపడిన వ్యక్తి అని తెలుస్తోంది.. ఈ వివాహంపై స్వప్న ఇంతవరకు నోరు మెదపలేదు.

 

ఎజెండా సెట్ చేసిందెవరు? అమలు చేస్తుందెవరు? || Analysis on ABN Radhakrishna Comments on Pawan Kalyan

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version