https://oktelugu.com/

Viral Video : ఆవు కోసం సింహంపై ఎదురుతిరిగిన రైతు.. ఏం చేశాడో తెలుసా?

సింహాన్ని చూస్తే ఏ జంతువైనా గజగజ వణకాల్సిందే. ఇక మనుషులైతు సింహం గాండ్రింపుకే పరుగులు పెడుతారు. కానీ ఆ రైతు తన ఆవును కాపాడుకునేందుకు చేసిన సాహసంపై అందరూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 1, 2023 / 10:17 AM IST
    Follow us on

    Viral Video : అడవికి రాజు సింహం.. మృగరాజును చూస్తే చాలు భయపడి ఆమడ దూరం పరుగెత్తుతాం.. అలాంటి సింహాన్ని మనుషులు భయపెట్టడం అందరికీ సాధ్యం కాదు. తెలివిగా మాత్రమే దానిని దెబ్బకొట్టగలం. కానీ ఓ రైతు ఎంతో ధైర్యంగా సింహాన్ని ఎదుర్కొన్నాడు. దాని నోట ఉన్న తన పెంపుడు ఆవును విడిపించుకున్నాడు. ప్రాణాలకు తెగించి సాహాసం చేసిన ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు చేసిన ఈ సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
    వ్యవసాయ పనుల కోసం రైతులు పశువులను పెంచుకుంటారు. పాడి పరిశ్రమను వృద్ధి చేయడానికి చాలా మంది వ్యవసాయంతో పాటు ఆవులను పెంచుకుంటుంటారు. వీటిని తమ కన్నబిడ్డల్లా చూసుకుంటూ వాటికి ఏ ఆపద వచ్చినా తల్లడిల్లిపోతారు. అలాంటి ఆవు ఒకటి సింహం గుప్పిట్లో చిక్కుకుపోతుంది. ఎంతో అపురూపంగా పెంచుకున్న ఆవును సింహాం దాడి చేయడాన్ని చూసి దాని యజమాని తట్టుకోలేకపోయాడు. ప్రాణాలను పణంగా పెట్టి దానిని రక్షించుకున్నాడు.
    గుజరాత్ రాష్ట్రంలోని ఓ రైతుకు చెందిన ఆవు మేత కోసం రోడ్డుపైకి వస్తుంది. అయితే ఇంతలోనే ఓ ఆడసింహం పొదల్లోనుంచి వచ్చి ఆవుపై దాడి చేస్తుంది. ఆవు మెడను నోట్లో పెట్టుకొని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఈ దృశ్యాన్ని చూసిన రైతు వెంటనే అప్రమత్తమయ్యాడు. అక్కడి నుంచే అరుపులు చేసుకుంటూ వచ్చాడు. ఒక పెద్ద బండరాయిని పట్టుకొచ్చి సింహంపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆ సింహం భయపడిపో ఆవును విడిచిపెడుతుంది.
    సింహాన్ని చూస్తే ఏ జంతువైనా గజగజ వణకాల్సిందే. ఇక మనుషులైతు సింహం గాండ్రింపుకే పరుగులు పెడుతారు. కానీ ఆ రైతు తన ఆవును కాపాడుకునేందుకు చేసిన సాహసంపై అందరూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా చాలా మంది రైతు ధైర్యాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వెళ్తే ఎంతటి ఆపదనైనా ఎదుర్కొవచ్చని కామెంట్స్ పెడుతున్నారు.