Upasana Konidela : ప్రపంచం లో ఉన్న ఇండియన్ సినీ అభిమానులందరూ ఇప్పుడు ఎంతో ఉత్సాహం గా #RRR మూవీ ఆస్కార్ అవార్డ్స్ పొందిన నేపథ్యం లో సంబరాలు చేసుకుంటున్నారు.కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, ప్రాంతం బాషా కి సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఇది తమ సినిమా సాధించిన విజయంగా పరిగణిస్తూ అనందం ని వ్యక్తపరుస్తున్నారు.
అయితే అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్, రాజమౌళి మరియు కీరవాణి తో పాటుగా రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.మన భారతదేశ సంస్కృతి ఉట్టిపడేలా ఆమె తెలుపు రంగు చీర ని ధరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.మన దేశం లో శాంతికి చిహ్నంగా నిలిచే తెలుపు రంగు ని ఎంత గౌరవిస్తామో అందరికీ తెలిసిందే.ఆ సంస్కృతి ప్రపంచం మొత్తం తెలిసేలా ఆమె చేసిన ఈ ప్రయత్నం కి మంచి పేరు లభించింది.
ఉపాసన ధరించిన ఈ చీరని జయంతి రెడ్డి అనే ప్రముఖ డిజైనర్ తయారు చేసింది,స్క్రాప్ రీసైలిక్డ్ సిల్క్ శారీ అని పిలవబడే ఈ చీరకి మ్యాచింగ్ అయ్యేట్టు బీనా గోయెంకా మెరుగులు దిద్దిన లిలియమ్ నెక్‌పీస్ ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది.ప్రకృతి ని సంరక్షించాలనే గొప్ప మనసు ఉపాసన కి స్వతహాగానే ఉంటుంది.అందుకే కార్బెన్ ఫుట్‌ప్రింట్స్‌తో తయారయ్యే పరికరాలను ఆమె ఉపయోగించడానికి ఇష్టపడడు.అందుకే హ్యాండ్ మేడ్ తో తయారు చేయించిన ఈ సిల్క్ శారీని ధరించింది.
ఇక ఆమె వేసుకున్న నెక్లెస్ గ్రాండ్ లుక్ ని తీసుకొచ్చింది.ఈ నెక్లెస్ ని తయారు చెయ్యడానికి దాదాపుగా నాలుగేళ్ల సమయం పట్టిందట.సుమారు 400 కేరట్ల హై క్వాలిటీ రూబీస్ (400 carats of high-quality rubies), జెమ్ స్టోన్స్, ముత్యాలతో నగిషీలు దిద్దిన ఆభరణం ఇది.దీని విలువ కోట్లలోనే ఉంటుంది.ఈ సందర్భంగా ఉపాసన ధరించిన చీర మరియు నెక్లెస్ గురించి ఆమె మాటల్లోనే మీరు క్రింది వీడియోలో వినండి.