Rishab Shetty- NTR: రిషబ్ శెట్టి… ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారు మ్రోగుతున్న పేరు ఇది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. పదేళ్లుగా కష్టపడినా రాని గుర్తింపు, ఫేమ్ కాంతార చిత్రం తెచ్చిపెట్టింది. ఆ చిత్ర హీరో, రచయిత, దర్శకుడు ఆయనే కావడంతో అందరూ ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. ఒక ఆదివాసీ తెగకు అడవిలో ముడిపడిన సంబంధాన్ని వారి కులదైవంతో ముడిపెట్టి తెరకెక్కించిన తీరు స్క్రీన్ పై అద్భుతం చేసింది. కాంతార మూవీ ఇప్పుడు ఇండియా వైడ్ ఒక సంచలనంగా మారింది.

కాగా కాంతార చిత్ర హీరో రిషబ్ శెట్టితో మన టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కి ఒక రిలేషన్ ఉంది. ఈ విషయాన్ని రిషబ్ శెట్టి స్వయంగా తెలియజేశారు. తెలుగు హీరోల్లో తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమన్న రిషబ్ శెట్టి… ఓ ఆసక్తికర విషయాన్నిబయటపెట్టారు. ఎన్టీఆర్ తల్లిగారు షాలిని తమ గ్రామానికి చెందిన వారే అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
రిషబ్ శెట్టి పుట్టింది కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందపుర గ్రామంలో. అదే గ్రామానికి చెందినవారు షాలిని. ఆ విధంగా ఎన్టీఆర్ తో తనకు ఒక రిలేషన్ ఉందని రిషబ్ శెట్టి తెలియజేశారు. ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందిన వారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. షాలిని టీచర్ కాగా హరికృష్ణ ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ మొదటి భార్య కొడుకైతే, ఎన్టీఆర్ రెండో భార్య కుమారుడు.

కాగా రిషబ్ శెట్టిని మీడియా ప్రతినిధులు మరో ఆసక్తికర ప్రశ్న అడిగారు. మరి మీ అభిమాన హీరో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తారా? అని అడగ్గా, ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. మంచి కథ దొరికి అవకాశం వస్తే తప్పకుండా సినిమా చేస్తాను అన్నారు. ఇక తెలుగులో కూడా కాంతార రికార్డులు నమోదు చేస్తుంది. ఫస్ట్ డే పెట్టుబడి మొత్తం రాబట్టిన కాంతార రెండో రోజుకు 100 శాతానికి పైగా లాభాలు తెచ్చింది. అల్లు అరవింద్ కేవలం రూ. 2 కోట్లకు తెలుగు హక్కులు కొన్నారు. కాంతార రెండు రోజులకు రూ. 4.85 కోట్ల షేర్ వసూలు చేసింది.