
Heroine Neha : 20 ఏళ్ల కిందట వివి వినాయక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. ఆ సమయంలో ఈయన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారితో మాస్ సినిమాలను తీసేవారు. అప్పుడే ‘దిల్’ సినిమాను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాలో హీరోగా రెండే రెండు సినిమాలు చేసిన నితిన్ కు అవకాశం ఇచ్చారు. కానీ ఆయన తన ఫర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇక దీనికి నిర్మాత వహించిన రాజుకు ‘దిల్’ రాజు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ కొనసాగుతోంది. మరో విశేషమేంటంటే ఈ సినిమాతోనే హీరోయిన్ నేహ బాంబ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. లేటేస్టుగా నేహకు సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎలా ఉందో చూడండి..
సినిమాల్లో ఉన్నంతకాలం చాలా మంది హీరోయిన్లు అందంతో అలరిస్తుంటారు. కానీ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న తరువాత వారి రూపం మారుతుంది. కొన్ని కారణాల వల్ల గుర్తుపట్టకుండా మారిపోతారు. ‘దిల్’ సినమాతో పరిచయం అయిన నేహ బాంబ్ ఆ తరువాత జగపతిబాబుతో కలిసి ‘అతడే ఒక సైన్యం’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాల్లో కనిపించారు. కానీ ఈమెకు స్టార్ గుర్తింపు రాలేకపోయింది.దీంతో ఈమె బాలీవుడ్ కు పయనమైంది. అక్కడ సినిమాల్లో చాన్స్ లు రాలేదు గానీ.. టీవీ సీరియల్స్ లో మాత్రం ఆఫర్లు వచ్చాయి.
అలా కొన్ని రోజులు గడిచిన తరువాత అమె 2007లో థాబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేహ సినిమాల్లో కనిపించకపోయిన సోషల్ మీడియాను బాగా వాడుతుంది. కానీ కొన్ని రోజులుగా ఆమె పర్సనల్ విషయాలు షేర్ చేయలేదు. చాలా రోజుల తరువాత తన భర్త, పిల్లలతో కలిసి ఉన్న ఓ పిక్ నెట్టింట్లో షేర్ చేసింది. ఈ పిక్ బాగా వైరల్ అవుతోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ నేహలో ఎలాంటి మార్పు రాలేదు. అంతే అభినయంతో చక్కని చిరునవ్వును చిందిస్తున్నారు.
ఈ సందర్భంగా నేహ పిక్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ సినిమాల్లో నటిస్తారా? అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు. అయితే నేహ ప్రస్తుతం బాంబేలో ఉంటున్నట్లు సమాచారం. ఆమె సినిమాల్లో అవకాశం వచ్చినా చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్న చాలా మంది హీరోయిన్లు కుటుంబానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. నేహ కూడా అలాంటి డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ్ల వారు పెద్దయ్యాక సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రాట్ చేస్తారు కావచ్చు అని మరికొందరు మెసేజ్ పెడుతున్నారు.