
Heroine Vimala : తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చారు. కొందరు ఒకే సినిమాతో మళ్లీ కనిపించకుండా పోయారు. మరికొందరు మాత్రం దశాబ్దాల పాటు తమ ప్రభావం చూపించారు. సావిత్రి, జము. శ్రీదేవి, జయసుధ, జయప్రద, విజయశాంతి వంటి వారు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సహజమైన నటనతో వారి కళను కళ్లకు కట్టారు. దీంతో వారు దాదాపు అందరు హీరోలతో జతకట్టి తమకెదురు లేదని నిరూపించారు. ఇలాంటి పరిశ్రమలో కొందరు మాత్రం ఒకే సినిమాతో అంతర్థానమయ్యారు.

విమల
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాతో తెలుగు తెర రంగ ప్రవేశం చేసిన విమల అందరికి గుర్తుంటే ఉంటుంది. తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తరువాత తెలుగులో కనిపించలేదు. తమిళం, మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో మాత్రం ఒకే సినిమా చేసింది. అందం, అభినయం, అమాయకత్వంతో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2004లో..
2004లో విడుదలైన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా ప్రేక్షకులను అలరించింది. అందులో నటించిన నాయిక విమలకు మంచి పేరు తీసుకొచ్చింది. మాస్ మహారాజ రవితేజకు గుర్తింపు తీసుకొచ్చింది. తరువాత విమల తెలుగులో కనిపించలేదు. తమిళంలో గుండ్క మందక్క, తిరుపతి, తుంకుం, నకుముమ్, చెన్నైయిల్ ఒరునార్ వంటి సినిమాల్లో నటించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సంసారంలో తలమునకలైంది.

మలయాళంలో..
మలయాళంలోనూ కొన్ని సినిమాల్లో నటించినా తెలుగు వైపు చూడలేదు. తరువాత తమిళంలో సీరియళ్లలో నటించింది. పెళ్లి తరువాత నటన మానేసింది. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన విమల తరువాత ఎందుకో కానీ తెలుగులో అంతర్థానమైపోయింది. రెండో సినిమా చేయలేదు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమెను మరచిపోలేదు.