
Dasara Movie Climax: ప్రస్తుతం విడుదల అవ్వబోతున్న సినిమాల్లో అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి ‘దసరా’. న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ఈ సినిమా పై ప్రస్తుతం మార్కెట్ లో మామూలు క్రేజ్ లేదు. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన పాటలు మరియు ట్రైలర్ మూవీ పై మరింత అంచనాలు పెంచేలా చేసింది.

గత కొంత కాలం నుండి కెరీర్ లో సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న నాని ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో ఆయన స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా, పాన్ ఇండియా లెవెల్ ‘కాంతారా’ చిత్రం ఎలా అయితే హిట్ అయ్యిందో, అలా హిట్ అవుతుంది అనే బలమైన నమ్మకం తో ఉన్నాడు. ఆయన నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే ఈ నెల 30 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి రీసెంట్ గా తెలిసిన ఒక వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా నాని సినిమాలు తక్కువ బడ్జెట్ తోనే నిర్మితమవుతుంది. అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతాది. కానీ ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ నాని గత చిత్రాలకంటే భారీ గా జరిగినట్టు తెలుస్తుంది.

అంతే బడ్జెట్ కూడా భారీ గానే పెట్టారంటే,అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 50 కోట్ల వరకు ఖర్చు చేసారని తెలుస్తుంది.అందులో కేవలం క్లైమాక్స్ కోసమే దాదాపుగా 5 కోట్లు ఖర్చు చేశారట. సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలవబోతున్న ఈ క్లైమాక్స్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేసేలా ఉంటుందట,మరి ఆ క్లైమాక్స్ ఏంటో చూసేందుకు ఆడియన్స్ కూడా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన కూడా హైలైట్ గా నిలవబోతుంది అని టాక్.