Homeఎంటర్టైన్మెంట్Tamannaah Assets: అరుదైన వజ్రాలు, లగ్జరీ కార్లు, ముంబైలో ఫ్లాట్లు... హీరోయిన్ తమన్నాకు ఎన్ని వందల కోట్ల...

Tamannaah Assets: అరుదైన వజ్రాలు, లగ్జరీ కార్లు, ముంబైలో ఫ్లాట్లు… హీరోయిన్ తమన్నాకు ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉందో తెలుసా!

Tamannaah Assets: తమన్నా చిత్ర పరిశ్రమకు వచ్చి 17 ఏళ్ల దాటిపోయింది. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. టాలీవుడ్ టు బాలీవుడ్ దాదాపు అన్ని పరిశ్రమల్లో పని చేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్టార్డం అనుభవించారు. రెండు తరాల స్టార్స్ ని కవర్ చేసిన ఘనత తమన్నా సొంతం. ఎన్టీఆర్, మహేష్, పవన్, చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లలో ఎవరినీ వదల్లేదు. అలాగే సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జునల చిత్రాల్లో నటించారు. పూజా హెగ్డే, రష్మిక మందాన, కీర్తి వంటి యంగ్ బ్యూటీస్ టాలీవుడ్ ని ఏలేస్తున్నా తమన్నా జోరు తగ్గలేదు. తనకు రావాల్సిన ఆఫర్స్ ఆమె పట్టేస్తుంది.

Tamannaah Assets
Tamannaah

తనతో పాటు పరిశ్రమకు వచ్చిన కాజల్ సైతం స్లో అయ్యింది. 2020లో వివాహం చేసుకున్న కాజల్ వ్యక్తిగత కారణాలతో కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదు. ప్రెగ్నెన్సీ నేపథ్యంలో ఆమె కొంత విరామం తీసుకున్నారు. తమన్నా మాత్రం అసలు తగ్గేదేలే అంటుంది. మరి ఇన్నేళ్లు స్టార్ గా ఉన్న తమన్నా సంపాదన ఎంత? ఆమె ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టారు? అనే సందేహం అందరిలో ఉంది. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.

తమన్నా దగ్గర అరుదైన వజ్రాలతో పాటు విలువైన ఆభరణాలు, లగ్జరీ కార్లు ఉన్నాయట. అలాగే ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఆమెకు సొంత ఇళ్ళు ఉన్నాయట. తమన్నా ఒక్కో సినిమాకు రూ. 3 నుండి 4 కోట్లు తీసుకుంటుంది. ఆమె పలు బ్రాండ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఐటెం సాంగ్ చేస్తే రూ. 60 లక్షలు తీసుకుంటున్నారు. ఐపీఎల్ ఆరంభ వేడుకలో ఆడిపాడిన తమన్నా 10 నిమిషాల పెర్ఫార్మన్స్ కి రూ. 50 లక్షలు తీసుకున్నారు. సినిమాలు, ఎండార్స్మెంట్ ద్వారా నెలకు కోటి రూపాయలు తగ్గకుండా ఆమె సంపాదిస్తున్నారట. అంటే ఏడాది రూ. 12 కోట్లు ఆర్జిస్తున్నారు.

Tamannaah Assets
Tamannaah

2015 నుండి తమన్నా జ్యువెలరీ వ్యాపారం చేస్తున్నారు. వైట్ అండ్ గోల్డ్ అనే బ్రాండ్ నేమ్  తో జ్యువెలరీ  డిజైనర్ బ్రాండ్ ఉంది. ఇక తమన్నా వద్ద రూ. 2 కోట్లు విలువైన వజ్రం ఒకటి ఉంది. అది ఉపాసన ఆమెకు బహుమతిగా ఇచ్చారట. అలాగే ముంబైలోని ఖరీదైన ఏరియాలో రూ. 16 కోట్లు విలువ చేసే ఒక ప్లాట్ ఉంది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కూడా ఆమెకు సొంత ఇళ్ళు ఉన్నాయని సమాచారం. ఇక ల్యాండ్ రోవర్, బెంజ్, బి ఎం డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు తమన్నా వద్ద ఉన్నాయి. మొత్తంగా తమన్నా ఆస్తుల విలువ రూ. 110 కోట్లకు పైమాటే అంటున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version