
Heroine Madhavi Assets: ‘రగులుతోంది.. మొగలిపొద..’ అనే సాంగ్ 1980 దశకంలో ఊర్రూతలూగించింది. ఇప్పటికీ ఆ పాట వింటే యూత్ గుండెళ్లో రైళ్లు పరుగెడుతాయి. ఆ పాట లిరికల్ గానే కాకుండా ఇందులో నటించిన వారు తమ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. ‘ఖైదీ’ సినిమాలోని పాటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయనతో సమానంగా డ్యాన్స్ చేస్తూ అందాలు ఆరబోసిన భామ ఎవరో కాదు.. మాధవి. అలనాడు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన మాధవి ఆ తరువాత ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలయ్యాయి. ఇటీవల మాధవికి చెందిన చాలా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె వేల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
1979లో కె బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ‘మరో చరిత్ర’లో మాధవి నటించి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయగా అందులోనూ మాధవికే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. ఆ తరువాత చిరంజీవి తో సాటు స్టార్ హీరోల పక్కన నటించి అలరించారు. ఆ కాలంలో మాధవిని బీట్ చేయడానికి ఎంతో మంది హీరోయిన్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
అయితే కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే ఆమె 1996లో వ్యాపారవేత్త శర్మను పెళ్లి చేసుకున్నారు. వీరు అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మాధవి లెటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కనీసం గుర్తుపట్టలేకుండా మాధవి మారిపోవడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె భర్తకు తోడుగా వ్యాపారా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అలా తన ఆస్తులను పెంపుదల చేశారు.

హిందూ ఆధ్యాత్మిక గురువు స్వామి రామ తన అనుచరుల్లో ఒకరైన రాల్ఫ్ శర్మ ఫార్మాస్యూటికల్ వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారాన్ని తన భుజంపై వేసుకున్న ఆమె బిలియన్ల కొద్దీ ఆస్తులు కూడబెట్టారట. ప్రస్తుతం ఆమె అమెరికాలోని స్థానిక ధనవంతుల్లో ఒకరుగా ఉన్నారని చెబుతున్నారు. సినిమాల్లో ఉన్నంతకాలం ఆమె డబ్బు సంపాదించిందో లేదో గానీ.. పెళ్లయ్యాక మాత్రం బాగా కలిసొచ్చిందని అంటున్నారు.