Homeఎంటర్టైన్మెంట్Hrithik Roshan: అభిమాని కాళ్లు మొక్కిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Hrithik Roshan: అభిమాని కాళ్లు మొక్కిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Hrithik Roshan: నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అంటే ఎవరైనా మనకు ఏది చేసినా ప్రతిగా వారికి అది చేయడం పరిపాటే. ఎవరైనా మనకు సాయం చేస్తే తిరిగి చేయాలి. ఎవరైనా మనకు మేలు చేస్తే తిరిగి మనం చేస్తే వారు కూడా మనల్ని ఎంతో అభిమానిస్తారు. అలా ఏ పని చేసినా ప్రతిగా చేయడం మన సనాతన సంప్రదాయం. అందుకే మన రుషుల కాలం నుంచి కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు ఒక ఆచారంగా మారిన సంగతి తెలిసిందే. గురువు మనకు విద్య నేర్పిస్తే మనం గురుదక్షిణ ఇవ్వాలి. స్నేహితుడు మనకు సాయం చేస్తే ప్రతిగా అతడికి మనం ఇంకో రకంగా సాయమందించాలి అది సంస్కారం.

Hrithik Roshan
Hrithik Roshan

క్రికెట్ క్రీడాకరులు, సినిమా స్టార్లకు అభిమానులుంటారు. వారి కోసం వారి ప్రాణాలు సైతం లెక్కచేయరు. అంతటి అభిమానం వారి గుండెల్లో ఉంటుంది. అభిమానుల అండతోనే అందరు సెలబ్రిటీలుగా ఎదుగుతారనేది జీవితసత్యం. అయితే కొందరే వారిని గుర్తుంచుకుంటారు. కొందరైతే వారిని పట్టించుకోరు. ఇంకొందరు వారి కోసం ఏమైనా చేస్తారు. ఇక్కడ మన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన సాధారణ వ్యక్తిత్వాన్ని చాటాడు. ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటాడు.

Also Read: Asia Cup 2022 India vs Pakistan: ఇండియా, పాక్ మ్యాచ్ చూస్తే అంతే.. రూ. 5 వేలు జరిమానా

హృతిక్ రోషన్ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడంతో ఓ అభిమాని అతడి ఎదురుగా వెళ్లి కాళ్లు మొక్కాడు. దీంతో హృతిక్ రోషన్ కూడా ప్రతిగా అభిమాని కాళ్లు తాకి నమస్కరించుకున్నాడు. ఈ చర్యకు అందరు ఆశ్చర్యపోయారు. అతడు తన కాళ్లు మొక్కితే నేను కూడా అతడి కాళ్లు మొక్కడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. హృతిక్ సంస్కారానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంతటి సాధారణ మనస్తత్వం గల హీరో అంటూ వేనోళ్ల పొగుడుతున్నారు. అతడి సింప్లిసిటీకి తెగ సంబరపడుతున్నారు.

Hrithik Roshan
Hrithik Roshan

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హృతిక్ పెద్ద మనసుకు అందరు ప్రశంసిస్తున్నారు. ఒక అభిమానికి ఇంతటి విలువ ఇచ్చిన హృతిక్ నిజంగా పెద్ద మనసు గల హీరో అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హృతిక్ రోషన్ చేసిన పని నూటికి నూరు పాళ్లు సరిగా ఉందని కితాబిస్తున్నారు. అభిమానులపై ఇంతటి ప్రేమ ఉన్న హీరో కావడంతోనే అతడు బాలీవుడ్ ను ఏలుతున్నాడని పొగుడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.

Also Read:Bandi Sanjay: బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడు? కారణమేంటి?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version