Prabhas Spirit : ప్రభాస్ ఒకటికి నాలుగు చిత్రాలు ప్రకటించారు. ప్రస్తుతం నాలుగు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిపురుష్ రామాయణగాథగా తెరకెక్కుతుంది. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి రామునిగా నటిస్తున్నారు. కృతి సనన్ జానకిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసుడిగా చేస్తున్నారు. టీజర్ నిరాశపరిచిన నేపథ్యంలో బెటర్మెంట్ కి ట్రై చేస్తున్నారట. రావణాసురుడు లుక్ విషయంలో విమర్శలు వెల్లువెత్తాయి. రామాయణం అంటే తెలుసా? అని ఓం రౌత్ ని కొందరు ఏకిపారేశారు.
ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ షూట్ చివరి దశకు చేరుకుంది. కెజిఎఫ్ డైరెక్టర్ నుండి వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన వరల్డ్ వైడ్ సలార్ విడుదల కానుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. ఇండియాలో తెరకెక్కుతున్న అతిపెద్ద సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రాజెక్ట్ కే ని అభివర్ణించవచ్చు. రెండు చిత్రాలు సెట్స్ మీద ఉండగానే దర్శకుడు మారుతీ మూవీ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో మారుతీ మూవీ షెడ్యూల్స్ మొదలయ్యాయి.
రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కాగా చాలా రోజుల క్రితమే ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ప్రకటించారు. సందీప్ రెడ్డి ప్రస్తుతం యానిమల్ మూవీ చేస్తున్నారు. దీంతో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు సమయం పడుతుంది. అయితే స్పిరిట్ ని ఉద్దేశిస్తూ సందీప్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ అన్న అంటే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గకుండా స్పిరిట్ ఉంటుందన్నారు. యానిమల్ మూవీ తర్వాత నేను చేసే సినిమా స్పిరిట్ అని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
#Prabhas anna ante expectations ekkuvuntayi ga. ❤️
Sensational director @imvangasandeep about #Spirit 🔥#SandeepReddyVanga #SpiritTheMovie pic.twitter.com/h9BPwlsbLn
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 17, 2023