Dil Raju: ఎప్పుడూ విమర్శలు ఎదుర్కునే దిల్ రాజు బలగం మూవీ విషయంలో ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక చిన్న సినిమాను నిర్మించడం నుండి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే వరకు దిల్ రాజు తపన, ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. దిల్ రాజు అంటే బడా ప్రొడ్యూసర్. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసే వ్యక్తి. ఆయన హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్ వంద కోట్లకు పైగా ఉంటుంది. వారసుడు చిత్రానికి హీరో విజయ్ కి దిల్ రాజు రూ. 150 కోట్లు ఇచ్చాడని టాక్. ఇక రామ్ చరణ్ తో ప్రస్తుతం చేస్తున్న మూవీ బడ్జెట్ రెండు నుండి మూడు వందల కోట్లు ఉంటుంది.
నిర్మాతగా ఆయన చాలా బిజీ. కానీ బలగం మూవీ విషయంలో ఆయన అన్నీ తానై వ్యవహరించారు. తన బ్యానర్లో తెరకెక్కిన భారీ చిత్రాలను కూడా ఆయన ఈ స్థాయిలో ప్రమోట్ చేసింది లేదు. తెలంగాణ సంస్కృతి, పల్లె జీవనం, ప్రజల ఎమోషన్స్ గురించి చెప్పే బలగం కథ ఆయనను ప్రభావితం చేసింది. బలగం ఓటీటీలో విడుదల చేస్తే బెటర్ ని చాలా మంది సూచించారు. దిల్ రాజు మాత్రం లాభాపేక్ష చూసుకోకుండా థియేటర్స్లోనే విడుదల చేయాలని పట్టుబట్టారు.
అది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కూడా. స్టార్ క్యాస్ట్ లేని ఆర్ట్ సినిమాలను జనాలు థియేటర్స్ కి వచ్చి చూస్తారన్న గ్యారంటీ ఉండదు. పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కష్టమే. ఇవన్నీ దిల్ రాజుకు బాగా తెలుసు. అయినా బలగం మూవీ మీద ఉన్న మక్కువతో థియేటర్స్ లో విడుదల చేశారు. ప్రమోషన్స్ కూడా విరివిగా నిర్వహించాడు. ప్రీమియర్స్ వేయడం, మంత్రి కేటీఆర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవడం వంటివి చేసి బలగం చిత్రానికి హైప్ తెచ్చారు. ఆయన నమ్మకం ఫలించింది, సినిమా కాసులు కురిపిస్తుంది.
దిల్ రాజు చిన్న సినిమాలను ఇలా ప్రోత్సహించడం గొప్ప పరిమాణం. ఆయన దిల్ రాజు ప్రొడక్షన్ పేరుతో మరో బ్యానర్ ఏర్పాటు చేసి… వర్తమాన నటులు, దర్శకులను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ బ్యానర్లో కేవలం చిన్న చిత్రాలు తెరకెక్కుతాయి. దిల్ రాజుకు సినిమా అనే ఫ్యాషన్ తో పాటు బాధ్యత కూడా ఉందని నిరూపిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ వేణుని బలగం మూవీతో దర్శకుడ్ని దిల్ రాజు చేశారు. గతంలో కూడా అనేక మంది కొత్త దర్శకులకు దిల్ రాజు అవకాశం ఇచ్చారు. వేణుతో మరో చిత్రం చేస్తున్నట్లు సమాచారం.
Also Read:NTR- Pawan Kalyan: షాకింగ్ ట్విస్ట్… పవన్ కళ్యాణ్ బిరుదును వాడేసుకుంటున్న ఎన్టీఆర్!