Dil Raju wife Tejaswini Photoshoot: అగ్ర నిర్మాత దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్ లోనే నంబర్ 1 నిర్మాత. ‘దిల్’ అనే సినిమాతో నిర్మాతగా మారి హిట్ కొట్టిన రాజు ఇక ఆ సినిమానే ఇంటిపేరుగా మార్చుకొని ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను మనకు అందించాడు. టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఎంతో మంది స్టార్ హీరోలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. కథను బాగా జడ్జి చేసి కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి సినిమాను హిట్ పట్టాలెక్కించగల ఘనుడు. దిల్ రాజ్ సినిమా ఒప్పుకున్నాడంటే అది హిట్ అయినట్టే లెక్క. పెద్ద పెద్ద దర్శకులు, హీరోలు కూడా వాళ్ల సినిమాల రషెస్ దిల్ రాజుకు చూపించి మరీ ఆయన అభిప్రాయాలు తీసుకుంటారు.

దిల్ రాజు వ్యక్తిగత జీవితంలో ఒక విషాదం వెంటాడుతోంది. ఆయన భార్య 2017లో మరణించారు. 3 ఏళ్ల పాటు ఒంటరిగా గడుపుతూ వచ్చిన దిల్ రాజు అలా మౌనంగా మారిపోయారు. తండ్రి ఆవేదన చూడలేకపోయిన కూతురు హన్షిత రెడ్డి రెండో పెళ్లికి పట్టుబట్టడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు దిల్ రాజు.

ఈ లాక్ డౌన్ టైంలోనే మే 10న దిల్ రాజు.. తేజస్విని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక తేజస్విని వచ్చాక దిల్ రాజు పూర్తిగా మారిపోయారు. ఆయన లైఫ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.
Also Read: ‘పుష్ప’ లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

రెండో భార్య ప్రోత్సాహంతో దిల్ రాజు ఇప్పుడు ఫిట్ నెస్ పై కూడా ఫోకస్ పెట్టారు. వర్కౌట్లు చేస్తూ స్లిమ్ అయ్యారు.

తాజాగా పెళ్లయ్యాక చాలా రోజులకు తాజాగా తన రెండో భార్య తేజస్వినితో కలిసి ఓ ఫొటో షూట్ నిర్వహించారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read: ‘శ్యామ్ సింగ రాయ్’ సేఫ్ అయినట్లేనా?