Dil Raju Varasudu: ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాలలో వివాదాస్పదం గా మారిన చిత్రం ‘వారసుడు’..ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో భారీ లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు..ఈ సంక్రాంతికి చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటే తమిళ డబ్బింగ్ సినిమాని వేసుకొని వచ్చి వాళ్లకి థియేటర్స్ దక్కకుండా చెయ్యడం అన్యాయం అంటూ దిల్ రాజు పై అందరూ విరుచుకుపడ్డారు.

అయితే దీనికి దిల్ రాజు అనేక ఇంటర్వ్యూస్ లో తన వెర్షన్ చెప్పుకుంటూ సమర్ధించుకున్నాడు..కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ మేలు కోరుకునేవాడిలాగా ‘వారసుడు’ సినిమాని జనవరి 14 వ తేదికి వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు..నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీడియా కి ఈ విషయాన్నీ తెలియచేసాడు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో వారసుడు విడుదల తేదీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు..నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మా టీం లో పనిచేసే వాళ్ళ ద్వారా మేము ప్రకటించే ముందే బయటకి వార్తలు వచ్చేస్తున్నాయి.

ఈరోజు ఒక కీలక ప్రకటన చెయ్యడం కోసమే మీడియా సమావేశం ఏర్పాటు చేశాను..నేను తెలుగు సినిమాని తొక్కేస్తున్నాను అంటూ అందరూ నా మీద పడి ఏడుస్తున్నారు..చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటాము అని నేను ఇంతకు ముందే చెప్పాను..ఇప్పుడు ఆ చర్చలు పూర్తి అయ్యాయి..మా వారసుడు సినిమాని 14 వ తేదికి వాయిదా వేస్తున్నాము..ఈ సంక్రాంతికి చిరంజీవి మరియు బాలయ్య సినిమాలు విడుదల అవుతున్నాయి..వాళ్లకి థియేటర్స్ బాగా అవసరం ఉంది..వాళ్ళ మీద ఉన్న గౌరవం తోనే నేను నా సినిమాని వాయిదా వేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు..కానీ వాస్తవం అది కాదు..వారసుడు కి సంబంధించిన వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉంది..అది పూర్తి కాకపోవడం వల్లే విడుదల ని వాయిదా వేసాడని..సానుభూతి కొరకు చిరంజీవి – బాలయ్య సినిమాల కోసం వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు కవర్ చేసాడని సోషల్ మీడియా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.