Homeఎంటర్టైన్మెంట్Sukumar- Nani: సుకుమార్ ను నాని ఘోరంగా అవమానించాడా?

Sukumar- Nani: సుకుమార్ ను నాని ఘోరంగా అవమానించాడా?

Sukumar- Nani
Sukumar- Nani

Sukumar- Nani: కేజీఎఫ్ గురించి దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యల గురించి మర్చిపోకముందే.. నాచురల్ స్టార్ నాని దర్శకుడు సుకుమార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో సుకుమార్ అభిమానులు నానిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనంతటికి కారణం దసరా సినిమా ప్రమోషన్ లో నాని చేసిన వ్యాఖ్యలే.

నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా ఈ నెల 30 విడుదల కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రమోషన్లు భారీగా చేస్తున్నారు. ఈ బరువును మొత్తం నాని తన భుజానికి ఎత్తుకున్నాడు. అయితే ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన ఓ ప్రమోషన్ లో విలేకరులతో మాట్లాడాడు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ” పుష్ప సినిమా సమయానికి సుకుమార్ ఒక్క భాషలోనే పరిచయం. కానీ దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఐదు భాషల్లో పరిచయం” అంటూ నాని సమాధానం చెప్పాడు. దీంతో అగ్గి చెలరేగింది. ఆర్య, ఆర్య 2, కుమారి 21ఎఫ్ , నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సుకుమార్ ఏర్పరచుకున్నాడు. ఈయన సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. వీటిల్లో ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. అలాంటి సుకుమార్ ను పట్టుకొని నాని ఇలాంటి కామెంట్లు చేయడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కొంచెం సుకుమార్ స్థాయిని తక్కువ చేయడమే అని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి నానికి కొంతకాలం నుంచి సరైన హిట్లు లేవు. దసరా సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ ఉండటంతో నానిలో ఆత్మవిశ్వాసం భారీగా పెరిగింది. అందువల్లే తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడని ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్ద హీరోలు రాజమౌళి, సుకుమార్ లాంటి వాళ్ళ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లారు. వీరి దర్శకత్వంలో పనిచేయాలని చాలామంది పెద్దపెద్ద హీరోలు క్యూలో ఉన్నారు. ఈ విషయం తెలియక నాని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు తన కెరీర్లో భారీ వసూలు సాధించిన సినిమా లేదు. నాచురల్ స్టార్ అయినంతమాత్రాన నోరు అదుపులో ఉండాలి. లేకపోతే జరగబోయే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. పుష్ప సమయానికి సుకుమార్ కేవలం ఒక్క భాషలోనే పరిచయం అని అనడం సరైనది కాదు. ఒకసారి యూట్యూబ్ ట్రాక్ రికార్డు చూసుకుంటే సుకుమార్ స్థాయి ఏమిటో నానికి తెలిసేది. రంగస్థలం ఎంతటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందో నానికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అన్ని విషయాలు తెలిసినప్పటికీ తల బిరుసుతో తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడని సుకుమార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sukumar- Nani
Nani

కొవిడ్ సమయం లో వీ , టక్ జగదీష్ అనే సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు నేరుగా ఓటీటీ లో స్ట్రీమ్ అయ్యాయి. నేరుగా విడుదలతే మాత్రం నిర్మాతలకు తడిగుడ్డ కూడా మిగలకపోయేది. ఎందుకంటే అంతటి దారుణంగా ఉన్నాయి ఈ సినిమాలు. ఈ సినిమాలు స్ట్రీమ్ అవుతున్నప్పుడు నాని ఇలాగే ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. కానీ ఈ సినిమాలు చూసిన ప్రేక్షకులు బాగోలేదని ముఖం మీద తిరస్కరించారు. అందువల్ల ఎదుగుతున్నప్పుడు ఒదిగి ఉండటం మంచిది. మరీ ముఖ్యంగా ఆచి తూచి మాట్లాడటం మంచిది. ఒకసారి తేడా కొడితే మాత్రం ట్రోలింగ్ దెబ్బ ఏమిటో అవగతమవుతుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular