
మనలో చాలామందికి తక్కువ సమయంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అయితే ఎంతో శ్రమిస్తే మాత్రమే డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది. మనలో ఎవరికైనా ఒక వజ్రం దొరికితే చాలు ఒక్కరోజులో లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అయితే వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అయితే అమెరికాలోని ఒక ప్రాంతంలో మాత్రం సందర్శకులు ఎవరైనా వజ్రాలను వెతికి సులభంగా డబ్బులను సంపాదించవచ్చు.
మొత్తం 900 ఎకరాల విస్తీర్ణంలో మర్ఫీబొరా అనే ప్రాంతంలో 1900 సంవత్సరంలో తొలిసారి వజ్రాలు బయటపడ్డాయి. మొత్తం భూమిలో 37 ఎకరాలను అధికారులు సందర్శకుల వజ్రాల వేట కోసం కేటాయించడం గమనార్హం. ఆ 37 ఎకరాల స్థలంలో ఇప్పటివరకు సందర్శకులకు ఏకంగా 33,100 వజ్రాలు దొరికాయి. దొరికిన వజ్రాలలో ఎక్కువ వజ్రాలు పసుపు, గోధుమ, తెలుపు రంగులలో ఉండటం గమనార్హం.
అయితే ఈ పార్కుకు వెళ్లాలంటే మాత్రం ఉచితంగా వెళ్లడం సాధ్యం కాదు. పెద్దవాళ్లు ఎనిమిది డాలర్లు, పిల్లలు ఐదు డాలర్లు చెల్లించి టికెట్ ను కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్లడం సాధ్యమవుతుంది. వజ్రాల కోసం భూమిని తవ్వడానికి ఇక్కడ అద్దెకు పరికరాలు కూడా లభిస్తాయి. అద్దెకు పరికరాలు తీసుకోవడం ఇష్టం లేనివారు సొంతంగా పరికరాలను తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రాంతంలో పిల్లలు, పెద్దలు సేద తీరడానికి వినోద కేంద్రాలు కూడా ఉండటం గమనార్హం. కొంచెం అదృష్టం ఉన్నా ఈ పార్కులో వెతికితే వజ్రం మీ సొంతమవుతుంది. పిల్లలు, పెద్దలు ఈ ప్రాంతానికి వెళ్లి వజ్రాల కోసం పార్కును తెగ తవ్వేస్తూ ఉంటారు.