SIR -Movie Official Trailer : తొలిప్రేమ మూవీతో దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించారు. తొలిప్రేమ స్థాయిలో ఆ రెండు చిత్రాలు ఆడలేదు. దీంతో కొంచెం పంథా మార్చి సోషల్ మెసేజ్ తో కూడా యాక్షన్ ఎంటర్టైనర్ ట్రై చేశారు. ధనుష్ హీరోగా ‘సార్’ టైటిల్ తో బైలింగ్వెల్ మూవీ తెరకెక్కించారు. తమిళంలో వాతి టైటిల్ తో విడుదల చేస్తున్నారు. సార్ విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది.
సార్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని ట్రైలర్ చూశాక స్పష్టత వచ్చింది. అయితే లవ్, రొమాన్స్, కామెడీ వంటి కమర్షియల్ యాంగిల్ వదల్లేదు. రెండు మిక్స్ చేసి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారనిపిస్తుంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై తెరకెక్కిన సెటైరికల్ మూవీనే సార్. చదువు వ్యాపారంగా మారిపోయిన రోజుల్లో పేదోడికి అది అందని ద్రాక్షగా మారిపోయింది. కార్పొరేట్ సంస్థలు పెద్దల అండతో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను దెబ్బతీస్తున్నాయి. మూతపడేలా చేస్తున్నాయి.
ఎడ్యుకేషన్ ని కాస్ట్లీగా మార్చేసిన పెద్దలపై ఒక టీచర్ చేసిన యుద్ధమే సార్ మూవీ కథ. ఎడ్యుకేషన్ విలువ తెలియజేస్తూ, అది పేదలకు దూరం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కార్పొరేట్ శక్తులను ఎలా అడ్డగించాలనే విషయాలను కూలంకషంగా చర్చించారని అర్థమవుతుంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. ఇక ధనుష్ లెక్చరర్ పాత్రలో చక్కగా సెట్ అయ్యాడు. సముద్ర ఖని మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. సాయి కుమార్ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సార్ మూవీ ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ, ఎస్ సౌజన్య నిర్మిస్తున్నారు. సార్ మూవీపై అంచనాలు ఏర్పడగా మంచి ఓపెనింగ్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సార్ విజయం దర్శకుడు వెంకీ అట్లూరి చాలా అవసరం. వరుసగా రెండు ప్లాప్స్ పడిన నేపథ్యంలో సార్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు.