
Ram Charan Hollywood Movie: ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమోగిపోతున్న పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..నిన్న మొన్నటి వరకు రాజమౌళి పేరు బాగా వినిపించేది.#RRR సినిమా ఆయనే ఫేస్ గా ఉంటూ వచ్చాడు.కానీ ఇప్పుడు హాలీవుడ్ ఆడియన్స్ #RRR అంటే రామ్ చరణ్ అనేస్తున్నారు.ఆ సినిమా తరుపున అంతర్జాతీయ మీడియా చానెల్స్ అన్నీ ప్రత్యేక ఇంటర్వ్యూస్ కోసం రామ్ చరణ్ ని కలుస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అమెరికా లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వైపు కూడా కాస్త ఫోకస్ పెడుతారు అని ఆశించారు నందమూరి అభిమానులు.కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కూడా అక్కడి వాళ్లకి రామ్ చరణ్ యే కనిపిస్తున్నాడు.దీనిని బట్టీ చూస్తే గ్లోబల్ స్టార్ ట్యాగ్ రామ్ చరణ్ కి సరిగ్గా సూట్ అవుతుంది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.రీసెంట్ గానే ఆయన అమెరికా అత్యంత పాపులర్ పోడ్ కాస్ట్ ఛానల్ టాక్ ఈజీ కార్యక్రమం లో పాల్గొన్నాడు.

అక్కడ ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి.గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో రామ్ చరణ్ హాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ ‘అవును..నిజమే,పలు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లతో చర్చలు కూడా జరిగాయి, రాబొయ్యే రోజుల్లో నా హాలీవుడ్ మూవీ కి సంబంధించిన గుడ్ న్యూస్ ని అభిమానులకు చెప్పబోతున్నాను..కేవలం హాలీవుడ్ లో మాత్రమే కాదు, ఏ దేశం సినిమాలోనైనా నేను నటించడానికి సిద్ధం.ఎక్కడైతే సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందో , అక్కడ నేను నటించడానికి సిద్ధం’ అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.తమ అభిమాన హీరో హాలీవుడ్ స్థాయికి వెళ్లినందుకు అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.అయితే అది హాలీవుడ్ వెబ్ సిరీస్ /లేదా సినిమానా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.