https://oktelugu.com/

Deepti Sunayana : ఆసుపత్రి బెడ్ పై బిగ్ బాస్ దీప్తి సునయన… వీడియోతో క్లారిటీ!

నాకు ప్రమాదం జరిగిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేనైతే పూర్తిగా క్షేమంగానే ఉన్నాను. ఓ మూడేళ్ళ క్రితం 'అలియా ఖాన్ ' అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో కొన్ని క్లిప్స్ పట్టుకొని ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని " ఆమె చెప్పుకొచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2023 / 12:11 PM IST

    deepthi

    Follow us on

    Deepti Sunayana : యూట్యూబ్ వీడియోస్ , సాంగ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దీప్తి సునైనా ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 లో అడుగుపెట్టి అందరికి దగ్గర అయ్యింది. తనదైన క్యూట్ నెస్ తో బుల్లితెర మీద అందరినీ అలరించిన దీప్తి వెండితెర మీద మెరవలేకపోతుంది. బిగ్ బాస్ తర్వాత అయిన ఆఫర్స్ వస్తాయేమో అనుకుంటే అలాంటిది ఏమీ లేకపోగా ఆమె తిరిగి బుల్లితెర , యూట్యూబ్ కే పరిమితం అవుతుంది.

    తాజాగా గత రెండు మూడు రోజుల నుండి దీప్తి సునైనా గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆమెకు యాక్సిడెంట్ జరిగిందని, ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుందని ఆ వార్తల సారాంశం. దీనితో సోషల్ మీడియా లో కావచ్చు, మెయిన్ మీడియా లో కావచ్చు దీప్తి సునైనా కి ఏమైంది అనే ఆరాలు మొదలయ్యాయి. అయితే తాజాగా దీనిపై దీప్తి స్పందించి అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని తెలిపింది.

    ఆమె మాట్లాడుతూ ” నాకు ప్రమాదం జరిగిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేనైతే పూర్తిగా క్షేమంగానే ఉన్నాను. ఓ మూడేళ్ళ క్రితం ‘అలియా ఖాన్ ‘ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో కొన్ని క్లిప్స్ పట్టుకొని ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని ” ఆమె చెప్పుకొచ్చింది. అప్పట్లో ఉగ్రవాదులను ఎదిరించి ప్రాణాలతో బయటపడిన మలాలా జీవిత స్టోరీ ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు.

    అందులో దీప్తి కి ఆక్సిడెంట్ అయ్యి, బెడ్ మీద పడుకున్నట్లు కొన్ని సీన్స్ వున్నాయి. ఇప్పుడు వాటిని వైరల్ చేస్తూ ఆమెకు ఏదో జరిగిందనే హడావిడి చేస్తున్నారు. ఇక దీప్తి సునైనా విషయానికి వస్తే అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ నిజమే అన్నట్లు కూడా వాళ్ళు బిహేవ్ చేశారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వాళ్లిద్దరూ విడిపోయినట్లు తెలుస్తుంది .