https://oktelugu.com/

Deepika Padukone- Ranveer Singh: విడిపోతున్న స్టార్ కపుల్ దీపికా-రణ్వీర్… బాలీవుడ్ ని షేక్ చేస్తున్న సంచలన ట్వీట్!

Deepika Padukone- Ranveer Singh: స్టార్ కపుల్ రణ్వీర్ కపూర్-దీపికా పదుకొనె విడిపోతున్నట్లు ఓ సంచలన ట్వీట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. మోస్ట్ క్రేజీ లవబుల్ కపుల్ గా రణ్వీర్-దీపికా పదుకొనె ఉన్నారు. 2018లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ మూడు నాలుగేళ్లల్లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ వేదికలపై జంటగా మెరిశారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ వాక్ చేశారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : September 29, 2022 / 11:35 AM IST
    Follow us on

    Deepika Padukone- Ranveer Singh: స్టార్ కపుల్ రణ్వీర్ కపూర్-దీపికా పదుకొనె విడిపోతున్నట్లు ఓ సంచలన ట్వీట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. మోస్ట్ క్రేజీ లవబుల్ కపుల్ గా రణ్వీర్-దీపికా పదుకొనె ఉన్నారు. 2018లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ మూడు నాలుగేళ్లల్లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ వేదికలపై జంటగా మెరిశారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ వాక్ చేశారు. వీరి సంసారం సాఫీగా సాగుతుంది. అలాగే వీరి మధ్య మనస్పర్థలు వచ్చిన దాఖలాలు లేవు. సడన్ గా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వెలిసింది. దాని ప్రకారం… రణ్వీర్, దీపికా మధ్య మనస్పర్థలు తలెత్తాయట.

    Deepika Padukone- Ranveer Singh

    విడాకులు తీసుకొని ఈ జంట విడిపోయే అవకాశం కలదంటూ పరోక్షంగా ట్వీట్ చేశాడు ఉమర్ సంధు. వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు చేసిన ఈ కామెంట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ఉమర్ సంధు తన ట్వీట్ లో… దీపికా, రణ్వీర్ మధ్య పరిస్థితులు సక్రమంగా లేవని కామెంట్ చేశారు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యునిగా ఉన్న ఉమర్ సంధు ఇచ్చే సినిమా రివ్యూలు, రేటింగ్లు పలుమార్లు విమర్సలపాలయ్యాయి. తెలుగుతో పాటు ఆయన బాలీవుడ్ సినిమాలను ఫాలో అవుతూ ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలకు ఆయన భారీ రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఆయన బ్లాక్ బస్టర్ అన్న చిత్రాలు అనేకం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

    Also Read: Krishnam Raju Samsmarana Sabha: పెదనాన్న కృష్ణం రాజు కోసం మొగల్తూరులో ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు!

    కాగా ఏ ఆధారాలతో ఉమర్ సంధు రణ్వీర్, దీపికా మధ్య గొడవలు జరుగుతున్నాయని ట్వీట్ చేశాడనేది ఆసక్తికరంగా మారింది. ఉమర్ సంధు ట్వీట్ ఆధారంగా బాలీవుడ్ మీడియా అనేక కథనాలు వండి వార్చింది. ఇక దీపికా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె మానసిక ఒత్తిడికి గురవుతున్నారనేది కథనాల సారాంశం. ఇటీవల దీపికాను బ్రీచ్ కాండీ హాస్పిటల్ అడ్మిట్ చేశారట. అలాగే కొద్దిరోజుల క్రితం ఆమె ప్రాజెక్ట్ కే సెట్స్ లో కిందపడిపోయారు. హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రికి దీపికను హుటాహుటిన తరలించారు.

    Deepika Padukone- Ranveer Singh

    ఈ క్రమంలో దీపికా పదుకొనె మానసిక సమస్యలు ఇద్దరి మధ్య విభేదాలకు కారణం కావచ్చన్న వాదన వినిపిస్తుంది. కెరీర్ పరంగా ఇద్దరూ బిజీగా ఉన్నారు. రణ్వీర్ హీరోగా సర్కస్, రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇక దీపికా చేతిలో ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో పాటు షారుక్.. పఠాన్, జవాన్ చిత్రాలు ఉన్నాయి. అలాగే రణ్వీర్ సర్కస్ మూవీలో ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక నిజంగా రణ్వీర్-దీపికా మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయా లేదా అనేది తెలియాలంటే వారే స్వయంగా స్పందించాలి.

    Also Read: Chiranjeevi- Ram Charan: చిరంజీవి, రాంచరణ్ కు కలిసొచ్చిన తేదీ ఏంటో తెలుసా?

    Tags