https://oktelugu.com/

Mahesh Babu`s Mother Death: మహేష్ బాబు కుటుంబంలో ఒకే ఏడాదిలో రెండు విషాదాలు

Mahesh Babu`s Mother Death: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది చేదు విషాన్ని మిగిల్చింది. ఏమాత్రం కలిసి రాని సంవత్సరంగా మారింది. కొద్దిరోజుల క్రితమే అన్నయ్య మరణం.. ఇప్పుడు తల్లి మరణంతో మహేష్ కృంగిపోతున్నారు. అన్నయ్యను కనీసం కడసారి కూడా చూడకుండా ఆ సమయంలో కరోనాతో మహేష్ బాబు బాధపడ్డారు. ఇప్పుడు తల్లి ఆ బాధలోనే చనిపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కృష్ణ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2022 / 08:11 AM IST
    Follow us on

    Mahesh Babu`s Mother Death: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది చేదు విషాన్ని మిగిల్చింది. ఏమాత్రం కలిసి రాని సంవత్సరంగా మారింది. కొద్దిరోజుల క్రితమే అన్నయ్య మరణం.. ఇప్పుడు తల్లి మరణంతో మహేష్ కృంగిపోతున్నారు. అన్నయ్యను కనీసం కడసారి కూడా చూడకుండా ఆ సమయంలో కరోనాతో మహేష్ బాబు బాధపడ్డారు. ఇప్పుడు తల్లి ఆ బాధలోనే చనిపోవడంతో తట్టుకోలేకపోతున్నారు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కృష్ణ భార్య ఈ లోకాన్ని విడిచి వెళ్లాకు. కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఇందిరా దేవి తుదిశ్వాస విడిచారు.

    కాగా ఈ ఏడాది జనవరిలోనే కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు కన్నుమూశారు. ఈ ఘటన మరువక ముందే కృష్ణ కుటుంబంలో మరో విషాదం అలుముకుంది. మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో చనిపోయారు. ఆయన లివర్ మిగతా భాగాలు పాడై తుదిశ్వాస విడిచారు. రమేశ్ బాబుకు భార్య, కుమారుడు ఉన్నారు.

    పెద్ద కుమారుడు రమేశ్ బాబు మృతితో ఇందిరాదేవి కృంగిపోయింది. ఈ నేపథ్యంలోనే అతడి ఆలోచనలతోనే ఆరోగ్యం దెబ్బతిన్నది. నాటి నుంచి బయటకు కాకుండా మానసిక వేధనకు గురైన ఇందిరాదేవి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

    కృష్ణ గారిని ఇందిరాదేవి 1961 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత  కృష్ణ తన రెండో పెళ్లిని విజయ నిర్మలను చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇందిరా దేవి నిరాకరించారు. అయినా కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకొని వేరుగా ఉన్నారు. మూడేళ్ల క్రితం విజయ నిర్మల సైతం మరణించింది.

    కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు మహేష్ బాబు , రమేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని సంతానం. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

    కృష్ణ రెండో భార్య విజయనిర్మల కూడా మూడేళ్ల క్రితం చనిపోయారు. వరుసగా కృష్ణ కుటుంబంలో ముగ్గురు మరణించడం వారింత తీవ్ర విషాదం నింపుతోంది.