https://oktelugu.com/

Rana Naidu: రానా నాయుడు’ విషయం లో వెంకటేష్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన దగ్గుపాటి రానా

‘ Rana Naidu: విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుపాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయినా సంగతి అందరికీ తెలిసిందే.మొట్టమొదటిసారి వెంకటేష్ మరియు రానా కలిసి ఒక్క పూర్తి స్థాయి వెబ్ సిరీస్ లో నటించడం తో దీనిపై మొదటి నుండే అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. టీజర్ మరియు ట్రైలర్ కూడా మాస్ గా ఉండడం తో కచ్చితంగా […]

Written By:
  • Vicky
  • , Updated On : March 12, 2023 / 04:00 PM IST
    Follow us on

    Rana Naidu: విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుపాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయినా సంగతి అందరికీ తెలిసిందే.మొట్టమొదటిసారి వెంకటేష్ మరియు రానా కలిసి ఒక్క పూర్తి స్థాయి వెబ్ సిరీస్ లో నటించడం తో దీనిపై మొదటి నుండే అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి.

    టీజర్ మరియు ట్రైలర్ కూడా మాస్ గా ఉండడం తో కచ్చితంగా ఒక మంచి ఊర మాస్ వెబ్ సిరీస్ ని చూడబోతున్నాము అని అందరూ ఫిక్స్ అయ్యారు.అయితే ఈ సిరీస్ లో విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో తో బూతులు మాట్లాడించడం అనేది కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే కాదు, అడల్ట్ కంటెంట్ ని ఇష్టపడే ఒక వర్గపు యూత్ నుండి కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

    ఎంత అడల్ట్ కంటెంట్ అయితే మాత్రం కొడుకు దగ్గర కూడా అంత నీచమైన డైలాగ్స్ పెడుతారా అంటూ ఘోరమైన ట్రోల్ల్స్ వచ్చాయి.అయితే ఇన్ని ట్రోల్ల్స్ వచ్చినప్పటికీ కూడా ఈ సిరీస్ కి మంచి వ్యూస్ వచ్చాయి.ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానం లో ట్రెండ్ అవుతుంది.ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘మీరు చూపించిన ప్రేమకి నా ధన్యవాదాలు.ఎవరైనా ఈ సిరీస్ వల్ల హర్ట్ అయ్యుంటే దయచేసి క్షమించండి’ అంటూ రానా ఒక ట్వీట్ వేస్తాడు.

    ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.నాలుగు దశాబ్దాల వెంకటేష్ కెరీర్ లో ఎన్నడూ కూడా కనీసం డబుల్ మీనింగ్ వచ్చే డైలాగ్స్ కూడా వాడలేదని,అంత క్లీన్ ఇమేజి ఉన్న వెంకటేష్ కి మాయని మచ్చ లాగ ఈ వెబ్ సిరీస్ మిగిలిందని, దయచేసి ఇక నుండి ఇలాంటి సినిమాలు మా హీరో తో చేయించకండి అంటూ వెంకటేష్ అభిమానులు రానా ట్వీట్ క్రింద రిప్లై ఇస్తున్నారు.