
Dadasaheb Phalke Film Awards 2023: మన దేశం లో అత్యుత్తమ ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో ఒకటి ‘దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్’ నిన్న ముంబై లో ఎంతో అట్టహాసం గా జరిగింది.ఈ వేడుకకు బాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులందరూ హాజరయ్యారు.ఈ అవార్డ్స్ లో మన #RRR సినిమాకి చోటు దక్కింది.ఉత్తమ చిత్రం గా #RRR సినిమాకి అవార్డు దక్కినప్పటికీ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి మాత్రం ఎలాంటి అవార్డు దక్కలేదు.
కానీ బ్రహ్మాస్త్ర సినిమాలో హీరో గా నటించిన రణబీర్ కపూర్ కి మాత్రం ఉత్తమ నటుడిగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు దక్కడం ఆశ్చర్యాన్ని కలగచేసిన విషయం.రణబీర్ కపూర్ అద్భుతమైన నటుడే కానీ #RRR సినిమాలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ లో పావు శాతం కూడా బ్రహ్మాస్త్ర లో రణబీర్ కపూర్ చెయ్యలేదు.ఇది చూసే ప్రతీ ఒక్కరికి అర్థం అవుతాది, కానీ జ్యురీ మెంబెర్స్ మాత్రం ఈ రెండు చిత్రాలను చూడకుండానే అవార్డ్స్ ఇచ్చినట్టు సోషల్ మీడియా లో సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఇక ఉత్తమ చిత్రం గా గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘కాశ్మీర్ ఫైల్స్’ నిలిచింది.ఈ సినిమా తో పాటుగా అదే రేంజ్ లో ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సౌత్ చిత్రం ‘కాంతారా’ లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను రిషబ్ శెట్టి ‘మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది.

ఇక ఉత్తమ నటిగా ‘గంగూభాయ్ కైతవాడి’ లో నటించిన అలియా భట్ కి లభించింది.ఇక 2023 వ సంవత్సరం కి గాను అత్యుత్తమ సేవలను అందించినందుకు ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ కి కూడా స్పెషల్ అవార్డు దక్కింది.ఇలా ఈసారి వచ్చిన అవార్డ్స్ అన్ని న్యాయబద్దం గానే అనిపించినప్పటికీ ఉత్తమ నటుడు క్యాటగిరి కి మాత్రం అన్యాయం జరిగిందనే భావన ప్రతీ ఒక్కరిలో ఉన్నది.