https://oktelugu.com/

Asani Cyclone Impact: అసని తుఫాన్ ఎఫెక్ట్: ఏ దేశం నుంచో సముద్రంలో కొట్టుకు వచ్చిన బంగరు రథం.. వైరల్

Asani Cyclone Impact: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ ఏపీలో తీరం దాటడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఏపీ తీరమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా సముద్రం ఒడ్డుకు ఓ బంగారు వర్ణం మందిరం కొట్టుకు వచ్చిన సంఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది. శ్రీకాళుం జిల్లా సంతబొమ్మాలి సున్నాపల్లి రేవులో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. అసని తుఫాన్ ప్రభావంతో సముద్రంలో ఓ స్వర్ణ మందిరం తేలుతూ ఒడ్డుకు వచ్చింది. ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం […]

Written By:
  • NARESH
  • , Updated On : May 11, 2022 / 10:29 AM IST
    Follow us on

    Asani Cyclone Impact: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ ఏపీలో తీరం దాటడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఏపీ తీరమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా సముద్రం ఒడ్డుకు ఓ బంగారు వర్ణం మందిరం కొట్టుకు వచ్చిన సంఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది. శ్రీకాళుం జిల్లా సంతబొమ్మాలి సున్నాపల్లి రేవులో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.

    gold colour chariot

    అసని తుఫాన్ ప్రభావంతో సముద్రంలో ఓ స్వర్ణ మందిరం తేలుతూ ఒడ్డుకు వచ్చింది. ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం మందిరం సముద్రం ఒడ్డునుంచి కొట్టుకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. ఇది మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశానికి చెందిన రథం అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు.

    Also Read: Jagan Sketch On Chandrababu Arrest: చంద్రబాబును జైలుకు పంపేందుకు జగన్ భారీ స్కెచ్

    ఇంతవరకూ ఎప్పుడూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోలేదని.. తిత్లీ తుఫాన్ వంటి అతిభయంకరమైన తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇలా సముద్రంలో ఏవీ కొట్టుకురాలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

    gold colour chariot

    ఇక ఈ బంగారు రథాన్ని మత్య్సకారులు స్వాధీనం చేసుకొని రథం ఏ దేశానికి చెందిందనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ విదేశీ బంగారు రథం తమ తీర ప్రాంతానికి కొట్టుకురావడంతో స్థానికులు ఆశ్యర్యానికి గురవుతున్నారు.

    Also Read:S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

    Recommended Videos:

     

    Tags