
Crow: సాధారణంగా కాకిని అశుభంగా భావిస్తారు. కాకి మీదికొచ్చినా.. ఇంటిముందు కూర్చుని అరిచినా ఏదో జరుగుతుందని అనుమానపడుతారు. కానీ ఒక మనిషి చనిపోయినప్పుడు పిండపెట్టే సమయంలో మాత్రం కాకి కోసం ఆరాటపడుతారు. అంతవరకు మాత్రమే కాకి గురించి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు సినిమాల్లో కాకి నే ప్రధానమైంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కాకి ని సాధారణంగానే చూపించారు. కానీ ఇప్పుడు దానిని హీరో చేస్తున్నారు. ఇటీవల వచ్చిన రెండు సినిమాల్లోనూ కాకి ని హైలెట్ చేశారు. సాధారణంగా సినిమాల్లో చిలుక, నెమలి తదితర పక్షులను చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కాకి ని ప్రధానం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ మార్చిలో రిలీజైన బలగం మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసే ఉంటారు. ‘బలగం’ సినిమాలో పిట్ట ముట్డుడు అనే కాన్సెప్టును ప్రధానం చేశారు. ఇందులో సినిమా నటుల కంటే కాకినే హైలెట్ గా మారుతుంది. ఇందులో కొమురయ్య అనే వ్యక్తి మరణించిన తరువాత ఆయన ఆత్మ కాకి రూపంలో వచ్చి పిండం ముడుతుందని భావిస్తారు. ఈ తరుణంలో కాకి రాగానే తమ బంధువు వచ్చిందని అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. మొత్తంగా ఇందులో కాకి నే హైలెట్ గా మారింది.
ఇప్పుడు లేటేస్టుగా రిలీజైన ‘విరూపాక్ష’ చిత్రంలోనూ కాకిని ప్రధానంగా సినిమాను తీర్చిదిద్దారు. ఇందులో తాంత్రిక పూజల సమయంలో కాకిని ఎక్కువగా చూపిస్తారు. అంతేకాకుండా సినిమా ఎంట్రీలోనూ కాకి నే కనిపిస్తుంది. హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించారు. అంచనాలకు భిన్నంగా ఆదరణ రావడంతో సినిమా హిట్టుకొడుతుందనే అంటున్నారు. అయితే ఇందులోనూ కాకి ప్రధానంగా సినిమా రన్ అవడం ఆశ్చర్యమేస్తుంది.

ఇప్పటి వరకు పులులు, సింహాలు, రామచిలుక, నెమలి తదితర పక్షులను హైలెట్ చేశారు. కానీ ఈ మధ్య కాకి కి ఆదరణ పెరుగుతండడంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. శనీశ్వర వాహనం కాకి. అందువల్ల శనికి పూజ చేసే సమయంలో కాకిని కూడా పూజిస్తారు. కానీ ఇప్పుడు సినిమా వాళ్లకు కాకి వరంగా మారింది. కాకిన ఏ కొంచెం సేపైనా సినిమాలో చూపించాలని సెంటిమెంట్ గా అనుకుంటున్నారట.