
Sreemukhi: చీరలో సింగారించుకున్న శ్రీముఖి పరువాలు సరికొత్తగా ప్రదర్శించింది. కొంగు చాటు నుండి నడుము వంపులు ప్రదర్శిస్తూ మనసులు దోచేసింది. ఆమె అందాల జడివానలో తడిసిపోతున్న నెటిజెన్స్ పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు. శ్రీముఖి మీరు బ్యూటిఫుల్ అంటూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. శ్రీముఖి తరచుగా ఫోటో షూట్స్ చేస్తుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మరోవైపు శ్రీముఖి కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. స్టార్ యాంకర్ హోదా పట్టేసిన ఈ బొద్దుగుమ్మ చేతినిండా షోలతో బుల్లితెరను ఊపేస్తున్నారు. కొన్నాళ్లుగా ఏ ఛానల్ లో చూసినా శ్రీముఖిదే సందడి. టీవీ షోలు చాలవన్నట్లు ఓటీటీలో కూడా సత్తా చాటుతుంది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో శ్రీముఖి కొన్ని షోలకు యాంకరింగ్ చేశారు.

అలాగే నటిగా బిజీ కావాలనుకుంటున్నారు. రష్మీ గౌతమ్, అనసూయ స్టార్ యాంకర్స్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ పట్టేస్తున్నారు. రష్మీ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు. ఇక అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అదే తరహాలో శ్రీముఖి వెండితెర మీద వెలిగిపోవాలని కలలు కంటున్నారు.
శ్రీముఖి ఆశలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే కొన్ని భారీ ప్రాజెక్ట్స్ లో శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట. చిరంజీవి నటించిన భోళా శంకర్ లో శ్రీముఖి రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందని సమాచారం. ఆయనతో ఆమె రొమాన్స్ చేయనున్నారట. పవన్ కళ్యాణ్-భూమిక ఐకానిక్ సీన్ ని స్పూఫ్ ఎపిసోడ్ గా చిరంజీవి, శ్రీముఖి మీద తెరకెక్కించారన్న ప్రచారం జరుగుతుంది.

అలాగే బాలయ్య 108 మూవీలో కూడా శ్రీముఖి నటిస్తున్నారట. శ్రీముఖి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూ పోతున్న నేపథ్యంలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చే సూచనలు కలవు. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. అది పెద్దగా ఆదరణ పొందలేదు. మరోవైపు శ్రీముఖి పెళ్లి ఎవర్గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. అప్పుడప్పుడు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలను శ్రీముఖి ఖండిస్తున్నారు.