Nalgonda Private Hospital: కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత పేషెంట్స్ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తారో..ఎంత మోసం చేస్తారో అనేది మనం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఠాగూర్ సినిమాలో చూసే ఉంటాము..ఈ సినిమాలో చిరంజీవి ఒక చనిపోయిన శవం ని హాస్పిటల్ తీసుకొస్తాడు..చనిపోయిన విషయం డాక్టర్లకు తెలిసినప్పటికీ కూడా, ఆ శవం కి చికిత్స చేస్తునట్టు నటించి డబ్బులు కొట్టేయాలని చూస్తారు..సినిమాలు నిజ జీవితంలో జరుగుతున్నా సంఘటనలను ఆధారంగా తీసుకొని చేస్తారు అని అందరూ అంటూ ఉంటారు..ఈరోజు జరిగిన ఒక సంఘటన చూస్తే అది వాస్తవం అని అర్థం అవుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే నల్గొండ లో ఉన్న యశోద హాస్పిటల్స్ చేస్తున్న ఒక దుర్మార్గపు చర్యని ఆధారాలతో సహా బయటపెట్టిన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్..బందిపోటు ముఠా కంటే దారుణం అంటూ అతను హాస్పిటల్ ముందు చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం సెన్సషనల్ గా మారింది.
21 ఏళ్ళ పాప 14 వ తేదీన చనిపోతే ఇక్కడ డాక్టర్లు 15 వ తేదీన చికిత్స చేసారు..చనిపోయిన అమ్మాయికి ఎలా ట్రీట్మెంట్ చేసారు మీరు అసలు..ఇదెక్కడి అన్యాయం అని తల్లి తండ్రులు అడగడానికి వస్తే ‘మీకు 50 వేలు డిస్కౌంట్ లో చికిత్స చేసాము’ అంటూ ఎదురు సమాదానాలు చెప్తారా..పిలవండి ఒకసారి ఈ చికిత్స చేసిన డాక్టర్ ని..5 నిమిషాల్లో ఇక్కడకి పోలీసులు వస్తారు..మీ అంతు తేలుస్తాం..నగలు,పొలాలు తాకట్టు పెట్టుకొని వైద్యం కోసం ఇక్కడకి వచ్చే జనాలను మీరు ఇలా మోసం చేస్తారా.
పాపం ఈ అమ్మాయి తండ్రి పొలం ని అమ్మి తెచ్చిన డబ్బులివి అంటూ యశోద హాస్పిటల్స్ యాజమాన్యం ని కడిగిపారేశారు ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారింది..మరి దీని పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి..సోషల్ మీడియా లో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ సమస్యలపై వెంటనే స్పందించే గుణం ఉన్న KTR గారు ఇంతలా వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి రియాక్ట్ అవుతాడా లేదా అనేది చూడాలి.
చిరంజీవి ఠాకూర్ సినిమాని గుర్తుకు తెచ్చిన యశోద హాస్పిటల్ సచ్చిపోయిన శవానికి చికిత్స ఇచ్చిన యశోద డాక్టర్లు !ఓల్డ్ మలక్పేట యశోద హాస్పిటల్ pic.twitter.com/DsESgm2fRH
— Sumanth (@sumanthmaddali) October 25, 2022