Satyadev: సినీ సెలబ్రెటీ బయోగ్రఫీ : IBM కంపెనీ లో 8 లక్షల జీతం ఉన్న ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చిన సత్యదేవ్..

Satyadev: ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో విలక్షణమైన నటన తో అశేష ప్రజాదరణ పొందుతున్న హీరోలలో ఒకరు సత్యదేవ్.. ఇతగాడి మూవీస్ కి యూత్ లో ఉండే క్రేజ్ మామూలుది కాదు.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నేడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగే రేంజ్ కి వచ్చాడంటే అతను పడిన కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ నేడు పాన్ ఇండియన్ సినిమాలలో నటించే రేంజ్ కి ఎదిగాడు.. అలాంటి […]

Written By: Shiva, Updated On : January 25, 2023 3:20 pm
Follow us on

Satyadev: ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో విలక్షణమైన నటన తో అశేష ప్రజాదరణ పొందుతున్న హీరోలలో ఒకరు సత్యదేవ్.. ఇతగాడి మూవీస్ కి యూత్ లో ఉండే క్రేజ్ మామూలుది కాదు.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నేడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగే రేంజ్ కి వచ్చాడంటే అతను పడిన కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ నేడు పాన్ ఇండియన్ సినిమాలలో నటించే రేంజ్ కి ఎదిగాడు.. అలాంటి సత్యదేవ్ గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఆయన బయోగ్రఫీ లో తెలుసుకుందాం.

Satyadev

-బాల్యం.. విద్యాబ్యాసం:

సత్యదేవ్ 1989వ సంవత్సరం జులై నాలుగో తేదీన విశాఖపట్నంలో జన్మించాడు..అతని విద్యాబ్యాసం మొత్తం విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర జిల్లాలోనే సాగింది.. విశాఖపట్నంలోని SVS హైస్కూల్ మరియు నలంద విద్యాసంస్థలలో తన ప్రాథమిక విద్యని పూర్తి చేసాడు..ఆ తర్వాత విజయనగరంలో ఉన్న MVGR ఇంజనీరింగ్ కాలేజీ లో కంప్యూటర్ సైన్స్ చదివాడు.. సత్యదేవ్ స్కూల్ లో అయినా కాలేజీలో అయినా టాపర్ గా ఉండేవాడు..అంతమంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్.. చదువు మీద ఎంత శ్రద్ద ఉన్నప్పటికీ సినిమాలన్నా, మెగాస్టార్ చిరంజీవి అన్నా ఆయనకీ ఎంతో పిచ్చి..ఆ పిచ్చి తోనే ఇండస్ట్రీ లోకి వచ్చాడు.

-IBM కంపెనీలో వర్చ్యువల్ డిజైన్ ఆర్కిటెక్ గా :

సత్యదేవ్ సినిమాల్లోకి పూర్తి స్థాయిలో రాకముందు ప్రముఖ MNC కంపెనీ ఐబీఎంలో వర్చ్యువల్ డిజైన్ ఆర్కిటెక్ గా పని చేస్తుండేవాడు.. అతని నెల జీతం సుమారుగా 6 నుండి 7 లక్షల రూపాయిల వరకు ఉండేది..అదే కంపెనీ లో ఆయన తన కెరీర్ ని కొనసాగించి ఉంటె నేడు ఆ కంపెనీ లో ఉన్నత స్థానంలో ఉండేవాడు.. కానీ తనకి సినిమా మీద ఉన్న పిచ్చి కారణంగా 2016వ సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు..ఆ నమ్మకం ఈరోజు ఆయనని ఈ స్థానం లో నిలబెట్టింది.

-సినీ కెరీర్:

సత్యదేవ్ IBMలో జాబ్ చేస్తున్నప్పటికీ తీరిక సమయాలలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడు.. అలా ప్రముఖ దర్శకుడు దశరధ్ ప్రభాస్ తో తీసిన మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించే అవకాశాన్ని కల్పించాడు..ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యింది కానీ సత్యదేవ్ కి పెద్దగా గుర్తింపు రాలేదు..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఒక చిన్న పాత్ర చేసాడు.. అందులో సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రణితిని కిడ్నాప్ చేసే సన్నివేశం మీకు గుర్తు ఉండే ఉంటుంది.. ఆ సన్నివేశం లో కిడ్నాప్ గ్యాంగ్ లో కనిపిస్తాడు సత్యదేవ్.. అలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కూడా మహేష్ బాబు ఫ్రెండ్ గ్యాంగ్ లో ఉంటాడు.

Satyadev

అలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన సత్యదేవ్ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో హీరో గా చేసే అవకాశం దక్కింది..ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ సత్యదేవ్ కంటూ ఒక గుర్తింపు లభించింది.. ఆ తర్వాత అడపాదడపా సినీమాల్లో హీరో గా నటిస్తూ , మరో పక్క క్యారక్టర్ ఆర్టిస్ట్ మరియు నెగెటివ్ రోల్స్ చేస్తూ వచ్చిన సత్య దేవ్ కి ‘బ్లఫ్ మాస్టర్’ అనే సినిమాతో హీరోగా తొలి కమర్షియల్ సక్సెస్ లభించింది..ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన ‘బ్రోచేవారెవరు రా’ , ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. గత ఏడాది ఆయన మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో విలన్ గా నటించాడు.. చిరంజీవితో పోటీపడుతూ ఆయన చేసిన నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. అలాగే హిందీ లో ఆయన అక్షయ్ కుమార్ తో కలిసి ‘రామ్ సేతు’ అనే చిత్రంలో నటించాడు..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు కానీ , సత్యదేవ్ కి మంచి పేరు మాత్రం తీసుకొచ్చింది.

తాజాగా ఆయన ప్రముఖ టాప్ స్టార్ హీరోయిన్ తమన్నా తో కలిసి ‘గుర్తుందా శీతాకాలామ్’ అనే సినిమాలో నటించాడు..పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు..ప్రస్తుతం ఆయన చేతిలో ‘కృష్ణమ్మా’ మరియు ‘ఫుల్ బాటిల్’ వంటి సినిమాలు ఉన్నాయి..ఈ సినిమాలతో సక్సెస్ అందుకుంటాడా లేదో చూడాలి.

Tags