Chiranjeevi – Prabhas- Mahesh: ‘ఆర్ఆర్ఆర్’తో ఒక భారీ హిట్ వచ్చిందని సంబరపడేలోపే… వరుసగా వచ్చిన అగ్రహీరోల మూడు సినిమాలు ఫ్లాప్ కావడం అందరినీ కలవరపెడుతున్నాయి. ఇది యథాలాపంగా జరిగిందో లేక మరేదైనా కారణమో కానీ.. సీఎం జగన్ ను కలిశాక ముగ్గురు టాలీవుడ్ అగ్రహీరోల సినిమాలు ఫ్లాప్ కావడం చర్చనీయాంశమైంది. సినిమా టికెట్ల వివాదంలో జగన్ తో భేటి అయిన చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబుల చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. టాలీవుడ్ లోని బలమైన స్టార్ హీరోల సినిమాలే ఇలా వరుసగా డిజాస్టర్ కావడం అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.
రాజమౌళి సినిమాలో నటించాక ఆ హీరోల తదుపరి సినిమాలు ఫ్లాప్ అవుతాయనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అది ‘సీఎం జగన్ ’ను కలిశాక అని మార్చుకోవాలేమో అన్నంతగా ఈ సెంటిమెంట్ బలపడింది. ‘ఆర్ఆర్ఆర్’తో బంపర్ హిట్ కొట్టిన రాంచరణ్ తన తదుపరి చిత్రాన్ని తండ్రి.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ మూవీ తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మెగా తండ్రీకొడుకుల మేనియా కూడా ఈ సినిమాకు ఏమాత్రం హెల్ప్ కాకపోవడం గమనార్హం.
Also Read: CM KCR: కేసీఆర్ మళ్లీ మౌనం.. ఈసారి ఎవరికి మూడుతుందో?
ఇక అంతకుముందు భారీ అంచనాల నడుమ ఒకనొక సమయంలో ‘ఆర్ఆర్ఆర్’తో సంక్రాంతికి సై అన్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యి ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు దాని తర్వాత వచ్చిన రాధేశ్యామ్ అయితే అంతకుమించిన ఫ్లాప్ ను మూటగట్టుకుంది. రాజమౌళి సినిమా ‘బాహుబలి’లో నటించాక ప్రభాస్ కు అసలు హిట్ లేకుండా పోయింది. ఆ సెంటిమెంట్ ను ఇక్కడా రిపీట్ అయ్యింది.
Also Read: Samantha Ruth Prabhu: షాకింగ్ పిక్: బాత్రూంలో టవల్ తో సమంత.. త్వరగా వచ్చేయ్ అంటూ ఫొటో షేర్
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సీఎం జగన్ ను కలిసి ఏపీలో సినిమా టికెట్ల రేట్లను పెంచుకున్న ముగ్గురు అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ లు తమ చిత్రాలను వరుసగా విడుదల చేశారు. ముందుగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవి ‘ఆచార్య’ వచ్చి అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు మహేష్ బాబు ‘సర్కారువారి పాట’కు నెగెటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా కూడా పోయినట్టేనని కొందరు అంటున్నారు.
దీంతో జగన్ ను కలిశాక ఈ ముగ్గురి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజానికి వీళ్లు ఈ సినిమాలు మంచి కథ బలంతో తీయకపోవడం వల్లే ఫ్లాప్ అయ్యాయని.. దానికి సీఎం జగన్ కారణమేంటి? అని పలువురు కౌంటర్లు ఇస్తున్నారు. జగన్ ఏమైనా దర్శకుడా? రచయితనా? ఆయన వల్లే సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.
ఏదిఏమైనా టాలీవుడ్ లో సెంటిమెంట్లు మాత్రం దీన్నే బలపరుస్తున్నాయి. రాజమౌళితో నటించాక ఆ హీరోకు ఫ్లాప్ కావడం.. సీఎం జగన్ ను కలిశాక ఈ హీరోల మూవీలు డిజిస్టార్ గా మిగలడం ఓ సెంటిమెంట్ అని ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
Also Read: Mahesh Babu Sarkaru Vaari Paata movie review: రివ్యూ : ‘సర్కారు వారి పాట’.. హిట్టా? ఫట్టా?
Recommended Videos