Chiranjeevi: హాలీవుడ్ మూవీ ఆధారంగా చిరంజీవి‘యముడికి మొగుడు..’ తెరకెక్కిందా? అసలు ట్విస్ట్ ఇదే

Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆయన సినీ లైఫ్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. డిఫరెంట్ కథలను ఎంపిక చేస్తూ చిరు సుప్రీం హీరోగా.. మెగాస్టార్ చిరంజీవిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నవరసాలు కలిగిన చిరంజీవికి సినీ డైరెక్టర్లు సైతం విభిన్న కథలను అందించి హీరోగా అవకాశం ఇచ్చేవారు. దీంతో కథకు తగ్గట్టు తన ఫర్ఫామెన్స్ చూపించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దద్దరిల్లిన రోజులు చాలానే ఉన్నాయి. […]

Written By: NARESH, Updated On : February 12, 2022 10:20 am
Follow us on

Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆయన సినీ లైఫ్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. డిఫరెంట్ కథలను ఎంపిక చేస్తూ చిరు సుప్రీం హీరోగా.. మెగాస్టార్ చిరంజీవిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నవరసాలు కలిగిన చిరంజీవికి సినీ డైరెక్టర్లు సైతం విభిన్న కథలను అందించి హీరోగా అవకాశం ఇచ్చేవారు. దీంతో కథకు తగ్గట్టు తన ఫర్ఫామెన్స్ చూపించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దద్దరిల్లిన రోజులు చాలానే ఉన్నాయి. ఇక ఆయన సినీ లైఫ్లో ‘యముడికి మొగుడు’ సినిమా ఎంత బ్లాక్ బస్టరో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో కీలక రోల్ లో నటించి జీవి నారాయణ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపాడు.

చిరంజీవి, విజయశాంతి తదితరులు నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాకు స్టోరీ లైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. అత్తగారింట్లో కొందరికి బుద్ది చెప్పడంతో పాటు స్వర్గంలో యముడితో ఢీకొట్టే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక చిరంజీవికి పోటీగా విజయశాంతి తన ఫర్ఫామెన్స్ చూపింది. నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీ పడి నటించారు. అలాగే ఈ సినిమాకు సాంగ్స్ కూడా హైలెట్ నిలిచాయి. ప్రతీ సాంగ్ ను జాగ్రత్తగా కంపోజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్టటికీ హైలెట్ గానే నిలుస్తాయి. ఇక బడ్జెట్ విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా ఆకాలంలో సినిమాను స్వర్గం సెట్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక ఈ సినిమాలో జీవి నారాయణ ఓ కీలక పాత్రలో నటించారు. అయితే ఆయన ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పాడు. ఈ సినిమా కథా రచణలో సత్యానంద్ తో పాటు తనకూ భాగం ఉందన్నారు. వాస్తవానికి ఈ సినిమాను హాలీవుడ్ మూవీ ‘హెవెన్ కెన్ వెయిట్’ అనే చిత్రం ఆధారంగా తెరకెక్కించామని అన్నారు. హాలీవుడ్ సినిమాలను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలు రాయడంలో డి.వి.నరసరాజకు చాలా అనుభవం ఉందని, అందుకే ఈ కథతో ఆయన వద్దకు వెళ్లామన్నారు. అయితే ఆయన ఇలాంటివి ఇప్పటికే తెలుగు రాశామని తెలిపారు. కానీ ఈ సినిమాలో కొత్త పాయింట్ తీసుకొని రాస్తానని తెలియజేశాడు.

ఇక ఈ సినిమాను నిర్మించడానికి చిరంజీవి సోదరుడు నాగబాబు ప్రధాన కారణమన్నారు. ఆయనే హెవెన్ కెన్ వెయిట్’ మూవీని తెలుగులో తీయాలని సూచించినట్లు తెలిపారు. ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని, అయితే అలాంటి ఒకే రూపం ఉన్న మనిషిని వెతికి ఆ మనిషి శరీరంలోకి ఆత్మను పంపే విధంగా సినిమా కథను తయారు చేయించామన్నారు. దీంతో సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. సోషియో ఫాంటసీ చిత్రాకు అప్పుడప్పుుడే ఆదరణ లభిస్తున్న తరుణంలో ‘యముడికి మొగుడు’ సినిమా రిలీజై బంపర్ హిట్టు కొట్టింది. అప్పటి వరకు సాధారణ స్థితిలో ఉన్న నిర్మాతలు ఈ సినిమాతో వారి జీవితాలే మారిపోయానని అన్నారు.

ఇక హీరో చిరంజీవి రెండు పాత్రల్లో తనదైన శైలిలో నటించారు. అమాయకంగా.. రాష్ నెస్ గా రెండు పాత్రల్లో చిరంజీవి చాలా కష్టపడ్డాడని తెలిపారు. ఆయన కష్టానికి ఫలితంగాసినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అయిందన్నారు. ఇక విజయశాంతి నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందన్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ఇతర నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని జీవి నారాయణ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.