వాల్తేరు వీరయ్య సెట్స్ లో సడన్ గా పవన్ ప్రత్యక్షమయ్యారు. దీంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో సరదా సంభాషణ చోటు చేసుకుంది. కాగా నేడు వాల్తేరు వీరయ్య మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ ప్రోమో విడుదల చేశారు. సదరు ప్రోమోను పవన్ కి ప్రత్యేకంగా ప్రదర్శించి చూపారు. ఇక బాస్ పార్టీ సాంగ్ ప్రోమో బాగుందని పవన్ టీమ్ ని ప్రశంసించినట్లు తెలుస్తుంది

ఇక వాల్తేరు వీరయ్య మూవీ సెట్స్ ని పవన్ సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు, పవన్ లను ఒకే ఫ్రేమ్ లో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగా పవన్ దూసుకుపోతున్నారు. అంతకంతకూ ఆయన ప్రజాభిమానం సొంతం చేసుకుంటున్నారు. జనసేన పార్టీకి చిరంజీవి సంపూర్ణ మద్దతు తెలపడంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న చిరంజీవి… ఏదో ఒకరోజు పవన్ ఉన్నత స్థానం అధిరోహిస్తారు, ప్రజలు ఆయనకు కట్టబెడతారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాల్తేరు వీరయ్య కోసం దేవిశ్రీ మాస్ ఐటెం నెంబర్ స్వరపరిచారు. బాస్ పార్టీ సాంగ్ అదే అని తెలుస్తుంది. ఈ సాంగ్ లో చిరుతో కాలు కదిపేందుకు ముంబై నుండి ఊర్వశి రాతెలాను దించారు. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన దేవిశ్రీ బాస్ పార్టీ సాంగ్ తో దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ చిరంజీవికి జంటగా నటిస్తున్నారు. వీర సింహారెడ్డి మూవీతో బాలకృష్ణ కూడా సంక్రాంతి బరిలో దిగుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారింది.
Welcome to the Biggest Party 🤩#WaltairVeerayya First Single #BossParty glimpse out now!
Full song tomorrow at 4.05 PM 💥
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @UrvashiRautela @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/hlj4ANKxD9
— Mythri Movie Makers (@MythriOfficial) November 22, 2022