
Chiranjeevi Fan: మెగాస్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ రారాజు. ఆయన సినిమాలు చూసి హీరోలుగా, నటులుగా మారిన వారు ఎందరో ఉన్నారు. చిరంజీవి వెండితెర రారాజుగా కోట్ల మందిలో స్ఫూర్తి నింపారు. వారిలో డాన్సర్ విజయ్ ఒకరు. విజయ్ చిరంజీవి వీరాభిమాని. ఆయన డాన్సులు చూసి ప్రొఫెషనల్ డాన్సర్ గా ఎదిగాడు. పలు డాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించాడు. ఓ డాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా ఉన్న విజయ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. రాజమౌళి ఫినాలే గెస్ట్ గా హాజరై.. టైటిల్ అందించాడు. అయితే ఆ షోకి చిరంజీవి కూడా గెస్ట్ గా రావాల్సి ఉంది. అనుకోని కారణాలతో చిరంజీవి రాలేకపోయారు.
తన అభిమాన హీరో చేతుల మీదుగా బహుమతి అందుకోవాలన్న విజయ్ కల నెరవేరలేదు. ఆ విషయం తెలిసిన చిరంజీవి విజయ్ కి కబురు పెట్టాడు. అయితే అప్పటికే విజయ్ చైనా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇటీవల విజయ్ ఇండియా వచ్చిన విషయం తెలిసిన చిరంజీవి అభిమానిని తన ఇంటికి ఆహ్వానించారు. విజయ్ భార్య జ్యోతితో పాటు చిరంజీవిని కలిశారు.
అభిమాని చిరకాల కోరికను చిరంజీవి గుర్తుపెట్టుకొని మరి నెరవేర్చారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరంజీవి గొప్ప మనసును పలువురు కొనియాడుతున్నారు. ఇక అభిమాని విజయ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చిరంజీవి గారితో జస్ట్ ఒక ఫోటో దిగే అవకాశం వస్తే చాలనుకున్నాను. అలాంటిది రెండు రోజులు ఆయనతో గడిపే అదృష్టం దక్కింది. ఈ క్షణాలను జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనని విజయ్ అన్నారు. విజయ్ కుటుంబంతో పాటు 12 ఏళ్లుగా చైనాలో ఉంటున్నట్లు సమాచారం.

మరోవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది. దర్శకుడు కే ఎస్ రవీంద్ర తెరకెక్కించగా రవితేజ కీలక రోల్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకుడిగా ఉన్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేయడం విశేషం. ఈ ఏడాది భోళా శంకర్ విడుదల కానుంది.
