Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ జాతర గత పది రోజుల నుండి ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం నెగటివ్ రివ్యూస్ తో ప్రారంభమై నేడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ వైపు పరుగులు తీస్తుంది..ఇది నిజంగా ఎవరికీ సాధ్యం కానీ రేర్ ఫీట్ గా చెప్పుకోవచ్చు..పండుగ హాలిడేస్ వరకే జోరు ఉంటుంది..ఆ తర్వాత తగ్గిపోతుంది అని అనుకున్న ట్రేడ్ వర్గాలకు సైతం తన స్టార్ స్టేటస్ తో చుక్కలు చూపించాడు మెగాస్టార్..వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి..ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి జేజేలు పలుకుతున్నారు..ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు ఉంటే సినిమాలు ఏ రేంజ్ లో ఆడుతాయో అందరికి తెలిసిందే..’వాల్తేరు వీరయ్య’ విషయం లో అదే జరిగింది..ఇప్పటికే పది రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూద్దాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 31.00 కోట్లు
సీడెడ్ 16.20 కోట్లు
ఉత్తరాంధ్ర 17.01 కోట్లు
ఈస్ట్ 11.70 కోట్లు
వెస్ట్ 6.50 కోట్లు
నెల్లూరు 4.04 కోట్లు
గుంటూరు 7.02 కోట్లు
కృష్ణ 6.94 కోట్లు
మొత్తం 100.41 కోట్లు
ఓవర్సీస్ 5.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 12.50 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 118.61 కోట్లు

పైన ప్రాంతాలవారీగా పెట్టిన వసూళ్లు మొత్తం రిటర్న్ GST తో కలిపి వేసినవి..రిటర్న్ GST అనగా మూవీ బిజినెస్ కి GST కట్టిన డిస్ట్రిబ్యూటర్స్ కి కలెక్షన్స్ రూపంలో రిటర్న్ GST యాడ్ చేస్తారు..ఈమధ్య వస్తున్నా సినిమాలన్నిటికీ ఈ రిటర్న్ GST వేస్తున్నారు..అలా వాల్తేరు వీరయ్య కి కూడా యాడ్ చేసారు..ఆ లెక్కన చూస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ‘అలా వైకుంఠపురం లో’ వసూళ్లను బ్రేక్ చెయ్యడానికి ఎంతో దూరం లో లేదు అనే విషయం అర్థం అవుతుంది..రిపబ్లిక్ డే ఉండడం..దానితో పాటు వీకెండ్ కూడా వెంటనే రావడం తో ఈ సినిమాకి ఈ వారం కూడా భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.