Chiranjeevi Waltair Veerayya: వయసుతో పాటు అందం హరించుకుపోతుంది. అది ప్రకృతి నియమం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృద్ధాప్య ఛాయలు ఆపలేం. మేకప్ దాన్ని దాచలేదు. టాలీవుడ్ 80-90ల స్టార్స్ వయసు 60 ప్లస్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లలో పెద్దరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వెంకటేష్ చాలా కాలం క్రితమే వయసుకు తగ్గ పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే స్టార్డమ్ మార్కెట్ తగ్గని చిరంజీవి, బాలకృష్ణ మాత్రం కుర్ర హీరోల మాదిరి కమర్షియల్ రోల్స్ చేస్తున్నారు. వారు ఇంకా యంగ్ హీరోయిన్స్ తో డ్యూయట్స్ పాడుతున్నారు.

ఈ నలుగురు స్టార్స్ లో అతిపెద్ద మార్కెట్ చిరంజీవి ఇంకా మైంటైన్ చేస్తున్నారు. హిట్ మూవీ పడితే వందల కోట్ల వసూళ్లు ఆయనకు ఇంకా సాధ్యమే. కమ్ బ్యాక్ తర్వాత చిరంజీవి చేసిన సైరా దాదాపు మూడు వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఆయన యంగ్ హీరోలు కూడా కుళ్ళుకునేలా వరుస చిత్రాలు చేస్తున్నారు. 67 ఏళ్ల చిరంజీవి లుక్ మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది. గాడ్ ఫాదర్ వంటి పాత్రలకు ఓకే కానీ… హీరోయిన్ తో రొమాంటింగ్ సాంగ్స్ లో ఆ తేడా కనిపిస్తుంది.
అయితే వాల్తేరు వీరయ్య మూవీలో ఈ విమర్శను చిరంజీవి అధిగమించారు. చిరంజీవి లుక్ చాలా బాగుంది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆయన యంగ్ గా కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘శ్రీదేవి చిరంజీవి’ సాంగ్ లో చిరంజీవి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. శృతితో ఆయన జోడి అద్భుతంగా ఉంది. ఈ మధ్య కాలంలో చిరంజీవిని ఇంత అందంగా ఎవరూ చూపించలేదు. ఆ క్రెడిట్ దర్శకుడు కె ఎస్ రవీంద్ర, కెమెరా మెన్ ఆర్థర్ కె విల్సన్ కి ఇవ్వాలి.

ఇక వాల్తేరు వీరయ్య జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కీలక రోల్ చేస్తున్నారు. పోలీస్ అధికారి పాత్రలో ఆయన రచ్చ చేయనున్నారు. రవితేజ ఫస్ట్ లుక్ వీడియోకి మంచి ఆదరణ దక్కింది. మొత్తంగా సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.