Chiranjeevi- Balakrishna: రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక్క పాత ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో చిరంజీవి పట్టు వస్త్రాలు ధరించి పూలతో అలంకరించిన పందిరి మంచం మీద శోభనం పెళ్ళికొడుకులా తయారై కూర్చున్నాడు. అదే మంచం మీద బాలయ్య ఎదురుగా ఉన్నాడు. ఇద్దరి మధ్య సీరియస్ సంభాషణ జరుగుతుంది. చిరంజీవి ఉన్న శోభనం గదిలో బాలకృష్ణ ఎందుకు ఉన్నాడు? అసలు ఈ సంఘటన నేపథ్యం ఏమిటీ? ఎప్పుడు జరిగిందని? తెలుసుకోవాలనే ఆత్రుత నెటిజన్స్ లో నెలకొంది. ఆ ఫోటో పూర్వాపరాలు పరిశీలిస్తే సమాచారం అందుబాటులోకి వచ్చింది.

అది ఘరానా మొగుడు మూవీ సెట్స్ లో జరిగిన సంఘటన. దర్శకుడు కే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా ఘరానా మొగుడు తెరకెక్కింది. ఆ చిత్ర ఓపెనింగ్ డేకి గెస్ట్ గా బాలకృష్ణ వచ్చారు. ఘరానా మొగుడు సినిమాలో ఒక శోభనం సీన్ ఉండగా ఓపెనింగ్ డేనే రాఘవేంద్రరావు దాన్ని ప్లాన్ చేశారట. ఇక చిత్ర ఓపెనింగ్ కి వచ్చిన బాలకృష్ణ ఆ గెటప్ సెటప్ లో ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లి మాటామంతి జరిపారు. ఇండస్ట్రీలో బాలయ్యది లక్కీ హ్యాండ్ అనే పేరుంది. చాలా చిత్రాల ఓపెనింగ్స్ కి గెస్ట్ గా బాలయ్యను పిలిచేవారు.
అదే సమయంలో బాలకృష్ణకు రాఘవేంద్రరావు అత్యంత సన్నిహితుడు. ఆయన తండ్రి ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఘనత రాఘవేంద్రరావు సొంతం. ఆ పరిచయంతో బాలయ్యను తన సినిమా ఓపెనింగ్ కి పిలవడం జరిగింది. నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్స్ గా నటించిన ఘరానా మొగుడు సూపర్ హిట్ కొట్టింది. కీరవాణి సాంగ్స్ దుమ్మురేపాయి. ఏందీ బే ఎట్టాగ ఉంది వళ్లు, కిటుకులు తెలిసిన చిటపట చినుకులు వంటి సాంగ్స్ యూత్ ని ఊపేశాయి. ఘరానా మొగుడు సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ హిట్.

1992లో ఘరానా మొగుడు విడుదలై మంచి విజయం సాధించింది. ఆ ఏడాది బాలకృష్ణ మూడు చిత్రాలు చేశారు. వాటిలో రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్. అశ్వమేథం, ధర్మక్షేత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాన్ని దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించారు. బాలయ్య-విజయశాంతి కాంబినేషన్ మరోసారి కాసులు కురిపించింది. ఇక ప్రస్తుతానికి వస్తే చాలా కాలం తర్వాత చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ పోటీకి సిద్ధం అవుతున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి.