
Dasara Censor Report: దసరా మూవీకి సెన్సార్ సభ్యులు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మూవీలోని బూతు పదాలతో పాటు వైలెంట్ సన్నివేశాల్లో భారీగా కోత పెట్టారట. దసరా సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు చాలా కట్స్ చెప్పారట. దసరా మూవీ నేపథ్యం, క్యారక్టరైజేషన్స్ రీత్యా బూతు పదాలు వాడారు. తెలంగాణ మాండలికంలో కొంచెం అభ్యంతరకర పదాలు డైలాగ్స్ గా పెట్టారు. హీరో నాని ధరణి అనే బొగ్గు కార్మికుడు పాత్ర చేశాడు. మొరటు విలేజ్ కుర్రాడి పాత్ర కావడంతో నాని డైలాగ్స్ కస్ వర్డ్స్ కలిగి ఉన్నాయి.
దసరా టీమ్ యూ/ఏ కావాలన్నారట. అది ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో కట్స్ చెప్పారట. డైలాగ్స్ లో ఉన్న బూతు పదాలు మ్యూట్ చేయాలన్నారట. మొత్తంగా 36 కట్స్ చెప్పినట్లు సమాచారం. లేని పక్షంలో దసరాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తామన్నారట. దీంతో సెన్సార్ సభ్యుల సూచనలు అంగీకరిస్తూ దసరా మూవీలో కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయడంతో పాటు, సన్నివేశాలు తొలగించనున్నారట. ఈ విషయంలో టీమ్ అసహనంగా ఉన్నారట.
లెక్కకు మించిన కట్స్ నేపథ్యంలో మూవీ ఫీల్ మిస్సవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ మూవీలో నాని పలికిన కొన్ని పదాల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. హీరో ‘బాన్**’ వంటి బూతు పదం ఎలా చెప్తారని ప్రెస్ మీట్లో నానిని అడగడంతో ఆయన సమర్ధించుకున్నారు. ఇది వాడుకలో ఉన్న పదమే. దానర్థం బూతు కాదు. ఆత్మవిశ్వాసం ప్రదర్శించే క్రమంలో వాడతారని నాని వివరణ ఇచ్చారు.

కాగా దసరా మార్చి 30న దసరా వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర విజయం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాని విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు. దసరాతో భారీ హిట్ కొడుతున్నానంటూ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.