
Border Gavaskar Trophy 2023: ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ గురువారం నాగ్ పూర్ లోని విదర్భ మైదానంలో ప్రారంభం కానుంది.. ఈ సిరీస్ ద్వారా పలు రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, పుజారా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, స్మిత్ లాంటి ప్లేయర్లు ఈ రికార్డులపై కన్నేశారు.. నాలుగు టెస్టుల సిరీస్ కావడంతో విరాట్ కోహ్లీ, పుజారా లాంటి వాళ్లు అరుదైన రికార్డులను అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ ప్లేయర్ ఏ రికార్డుకు చేరువలో ఉన్నాడో ఒకసారి చూద్దాం.
విరాట్ కోహ్లీ
25 వేల అంతర్జాతీయ పరుగులకు దగ్గర్లో ఉన్నాడు. ఈ అరుదైన రికార్డుకు కేవలం 64 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ పరుగులు చేస్తే ఈ ఘనత అందుకున్న ఆరవ ఆటగాడిగా, రెండో ఇండియన్ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. స్వదేశంలో టెస్టుల్లో నాలుగు వేల పరుగుల మైలురాయికి 1503 పరుగుల దూరంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో విరాట్ కోహ్లీ 36 ఇన్నింగ్స్ లో 1682 పరుగులు చేశాడు. అతనికంటే సచిన్ టెండూల్కర్ 3,262, పాంటింగ్ 2,555, లక్ష్మణ్ 2,434, ద్రవిడ్ 2,143, మైకేల్ క్లార్క్ 2,049, పుజారా 1,893 తర్వాత ఏడో స్థానంలో ఉన్నాడు.
పుజారా
ఇతడు 2010లో మైలురాయికి 107 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 20 మ్యాచ్ లు ఆడిన పూజార 1893 రన్స్ చేశాడు. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ తర్వాత రెండు వేల పరుగుల మైలురాయి అందుకున్న నాలుగవ ఇండియన్ ఆటగాడిగా పూజార నిలుస్తాడు.
రవిచంద్రన్ అశ్విన్
టెస్టుల్లో 450 వికెట్ల అమ్మాయికి కేవలం వికెట్ దూరంలో ఉన్నాడు అశ్విన్. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న బౌలర్ గా అశ్విన్ నిలుస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 111 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డుపై కూడా కన్నేశాడు. అశ్విన్ ఇప్పటివరకు 89 వికెట్లు తీసుకున్నాడు.
రవీంద్ర జడేజా
చాలా రోజుల తర్వాత మళ్లీ ఇండియన్ టీం లోకి వచ్చిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 250 వికెట్లకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు జడజ 60 టెస్టుల్లో 242 వికెట్లు తీసుకున్నాడు. ఈ నాలుగు టెస్టుల సిరీస్లో జడేజా ఈ మైలురాయి అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అదే గనుక సాధ్యమైతే ఈ ఘనత సాధించిన ఎనిమిదవ ఇండియన్ బౌలర్ గా నిలుస్తాడు.

స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీల రికార్డుకు స్మిత్ ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ స్మిత్ ఎనిమిది సెంచరీలు చేశాడు.. సచిన్ 9 సెంచరీలతో టాప్ పొజిషన్లో ఉన్నాడు.
నాథన్ లయన్
ఇండియా పై వంద వికెట్ల రికార్డుకు లయన్ ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు.. ముత్తయ్య మురళీధరన్ తర్వాత ఇండియా పై ఇలా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అతడు నిలుస్తాడు.. ఇప్పటివరకు లయన్ 22 టెస్టుల్లో 94 వికెట్లు తీసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (111) తీసుకున్న అనిల్ కుంబ్లే రికార్డుపై కూడా కన్నేశాడు.