Waltair Veerayya Remake Rights: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం గా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..టీజర్ , ట్రైలర్ మరియు పాటలతో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపిన ఈ చిత్రం,విడుదల తర్వాత ఆ అంచనాలకు మించి ఉండడం తో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురుస్తుంది.

కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..అయితే ఒక సినిమా సూపర్ హిట్ అయితే రీమేక్ రైట్స్ ని కొనుగోలు చెయ్యడానికి సిద్ధంగా ఉండే బాలీవుడ్ హీరోలు ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారట.
ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే ఆడుతుండడం వల్ల అక్కడి హీరోలు కూడా అలాంటి సినిమాలు చెయ్యడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు..అందులో భాగంగానే ఈ సినిమాని కూడా రీమేక్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..బాలీవుడ్ బడా సూపర్ స్టార్, చిరంజీవి కి అత్యంత ఆప్త మిత్రుడు సల్మాన్ ఖాన్ ఇటీవలే ఈ సినిమాని వీక్షించాడట..సినిమా చాలా బాగుందని, అద్భుతంగా నటించారు అంటూ చిరంజీవి కి ఫోన్ చేసి అభినందించారట సల్మాన్ ఖాన్.

అంతే కాకుండా ఈ సినిమా నాకు బాగా సరిపోతుందని..నేను రీమేక్ చేయాలనుకుంటున్నాను అంటూ సల్మాన్ ఖాన్ చెప్పాడట..చిరంజీవి కూడా అందుకు ఎంతో సంతోషించి, మైత్రి మూవీ మేకర్స్ తో మాట్లాడి రీమేక్ రైట్స్ ఇప్పిస్తాను భాయ్, నీ తదుపరి చిత్రానికి ప్లాన్ చేసుకో అని అన్నాడట..అలా మెగాస్టార్ సినిమా థియేటర్స్ లో రన్ అవుతుండగానే వేరే భాషలో రీమేక్ అవ్వడానికి సిద్దపడింది.