BJP- TDP: నలభై ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ.. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు, ఆం్ర«దప్రదేశ్‌కు ఒకసారి ముఖ్యమంత్రి.. సీఎంగా 15 ఏళ్ల అనుభవం.. అయినా ఓ కుర్ర సీఎంను చూస్తే షివరింగ్.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా టెన్షన్.. గెలవకపోతే తనతోపాటు తన వారసుడి కెరీర్ క్లోస్ అన్న ఆందోళన ఇదీ నారా చంద్రబాబు పరిస్థితి. ఎలాగైనా గెలవాలని పొత్తుల కోసం ప్రాధేయపడుతున్న తీరు చూస్తే నలభై ఏళ్ల అనుభవం ఎంత దిగజారిందో అర్థమవుతోంది. అధికారం ఆయనకు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. తెలంగాణలో జాతీయ పార్టీకి మద్దతు ఇచ్చి.. ఆంధ్రా మద్దతు పొందాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్లే అనిపిస్తోంది. పొత్తు ఇక భ్రాంతేనా అనే సందేహాలు వస్తున్నాయి.

తెలంగాణపై ఆశలు అడియాసలేనా?
వచ్చే ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్లడం కోసమే చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి తెర పడినట్లేనా? ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో టీడీపీతో కలిసి వచ్చే పార్టీలే లేవా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం సభతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . గత ఎన్నికల ఓటమి తర్వాత క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం కోసం చంద్రబాబు తెలంగాణాలో అడుగు పెట్టారు. పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చంద్రబాబు భావిస్తూ తెలంగాణాలో వేస్తున్న అడుగులు తెలంగాణా రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. తెలంగాణాలో టీడీపీ ఎంట్రీ కేవలం బీజేపీతో పొత్తు కోసమే అన్న చర్చ ప్రధానంగా జరిగింది. ఏకంగా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, మంత్రులు, చంద్రబాబును టార్గెట్ చేసి ఈ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు.
పొత్తుపై కుండ బద్దలు కొట్టిన బండి..
కేవలం బీజేపీతో పొత్తు కోసమే, ఎన్నికల రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు బీజేపీ నేతలలో సైతం దీనిపై ఒక సందిగ్ధం నెలకొంది. నిజంగానే చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా ? అన్న అనుమానం బీజేపీ నేతల్లోల సైతం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ సమావేశంలో సీనియర్లు మాజీ ఎంపీ విజయశాంతి, ఎంపీ అరవింద్ టీడీపీతో పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కోరారు. దీనిపై స్పందించిన బండి తెలంగాణ రాష్ట్రంలో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయాన్ని కార్యకర్తలకు కూడా చెప్పాలని ఆయన సూచించారు.
గతంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశలపై నీళ్లు పోసినట్లయింది. గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని విజయశాంతి ఈ సమావేశంలో గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదనే చెప్పాలి. గతంలో పొత్తు పెట్టుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి, టీడీపీతో పొత్తు కారణమని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఒకే ఒక ఆప్షన్ బీజేపీ చేజారినట్టేనా?
ఇక టీడీపీకి తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీజేపీ. ప్రస్తుతం బీజేపీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. మొదటి నుంచి కేసీఆర్ ను వ్యతిరేకించే చంద్రబాబు, కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం అంతకంటే లేదు. ఇక ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే ఒంటరిగా పోటీ చేయాల్సిందే తప్ప పొత్తుతో ముందుకు వెళ్లే అవకాశం లేదని తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమైంంది.