https://oktelugu.com/

MM Srivalli Biography : సెలబ్రెటీ బయోగ్రఫీ : ఎం.ఎం. కీరవాణి సతీమణి శ్రీవల్లి గురించి తెలుసా?

MM Srivalli Biography  : ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు.. కొన్ని సార్లు ఆ మహిళ ప్రత్యక్షంగా కనిపిస్తే..మరికొన్ని సార్లు ఆమె తెరవెనుకే ఉండి ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొత్తంగా ఆయన ఫ్యామిలీ గురించే చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన తీసే ప్రతీ సినిమాలో జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పటి వరకు రాజమౌళి ఫ్యామిలీ సభ్యుల్లో ఆయన సతీమణి రమా రాజమౌళితో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2023 9:44 am
    Follow us on

    MM Srivalli Biography  : ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు.. కొన్ని సార్లు ఆ మహిళ ప్రత్యక్షంగా కనిపిస్తే..మరికొన్ని సార్లు ఆమె తెరవెనుకే ఉండి ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొత్తంగా ఆయన ఫ్యామిలీ గురించే చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన తీసే ప్రతీ సినిమాలో జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పటి వరకు రాజమౌళి ఫ్యామిలీ సభ్యుల్లో ఆయన సతీమణి రమా రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన కుమారుడు కాలభైరవ గురించి విన్నాం. కానీ ఈ టీంలో శ్రీవల్లి అనే ఆవిడ కూడా కొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోసిస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. ఎం.ఎం. కీరవాణి సతీమణి, రమా రాజమౌళి అక్క అయిన శ్రీవల్లి గురించి మనకు తెలియిన విశేషాలు ఎన్నో. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయాల్లో కోసం ఆమె పాత్ర కూడా ఉండడం షాకింగ్ విషయం. ఇక శ్రీవల్లి గురించి వివరాల్లోకి వెళ్తే..

    రమా రాజమౌళి చెల్లెలే శ్రీవల్లి. శ్రీవల్లి 7 సంవత్సరాల వయసులో ఉండగానే తండ్రి మరణించారు. ఆ తరువాత వీరిని మేనమాన తమ ఇంటికి రావాలని కోరారు. కానీ శ్రీవల్లి గారి తల్లి మాత్రం వారికి ఇబ్బంది కలగకుండా తానే పెంచుతానని చెప్పింది. అలా పచ్చళ్లు పెట్టి ఇంటింటికి తిరిగి వీరిద్దరిని పెంచారు. ఆ తరువాత ఒక హాస్టల్ ను నిర్వహిస్తూ శ్రీవల్లిని బాగా చదివించారు. అయితే ఎన్నడూ తల్లి పడే కష్టాన్ని కూతుళ్లకు చెప్పేవారు కాదట. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నట్లుగా ఆమె తల్లి పిల్లలకు నేర్పినట్లు రమా రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో బాగా చదువుకున్న శ్రీవల్లి తల్లి సహాయంగా ట్యూషన్స్ చెప్పి డబ్బులు సంపాదించేవారు. అక్క రమా కు కూడా పాకెట్ మనీ ఇచ్చేవారు.

    1989 ఆగస్టు 23న శ్రీవల్లికి కీరవాణితో వివాహం జరిగింది. ఆ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ కె. చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఆప్పుడు విజయేంద్రప్రసాద్ రాసిన సినిమాలు పెద్దగా రాణించకపోవడంతో కీరవాణికి ఆఫర్స్ ఉండేవి కావు. అటు కీరవాణి తండ్రి శివశక్తి దత్త రచయిత. ఆయనకు కూడా అవకాశాలు లేక ఖాళీగా ఉండేవారు.ఈ సమయంలో రాజమౌళి ఇంకా చదువుకుంటున్నారు. అయితే కీరవాణి తనకు వచ్చిన రూ.200 లతో కుటుంబాన్ని పోషించేవారట. ఈ సమయంలో శ్రీవల్లి ఆ డబ్బుతోనే ఇల్లు చక్కబెట్టేదట. ఇంట్లో వాళ్లందరినీ ఏమాత్రం కసురుకోకుండా అందరినీ ఆప్యాయతతో చూసేవారట. అందుకే ఇప్పటికీ కుటుంబ సభ్యులంతా కలిసే ఉంటున్నారు.

    రాజమౌళి గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. కానీ ఎవరూ ఆయనను నమ్మనప్పుడు ఆయన ప్రతిభను మొదట గుర్తించింది శ్రీవల్లినే అని చెబుతారు. ఆ విషయాన్ని రాజమౌళినే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళి ఇంటర్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి వచ్చారు. ఈ సమయంలో రాజమౌళి గురించి కొందరు హేళన చేసి మాట్లాడితే శ్రీవల్లి సహించేవారు కాదు. అతను భవిష్యత్ లో చాలా గొప్పవాడు అవుతారు అని వారికి ఘాటుగా సమాధానం చెప్పేవారు. శ్రీవల్లి రాజమౌళి గురించి అలా చెప్పడంతో ఆయనలో ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది. అంతేకాకుండా ఆమెను వల్లమ్మ అని పిలిచేవారు.

    శ్రీవల్లి కోసం రమా అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో రాజమౌళితో పరిచయం ఏర్పడి ఆ తరువాత ప్రేమగా మారింది. పెద్దల ఇష్టంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. రాజమౌళి దంపతుల పిల్లలనుకూడా శ్రీవల్లి క్రమశిక్షణతో పెంచారు. క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీపడేవారు కాదట. అవసరమైతే వారిని దండించేవారట. శ్రీవల్లి, కీరవాణిలకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరు కాలభైరవ, మరొకరు శ్రీసింహ. కాలభైరవ రాజన్న సినిమా నుంచి సింగర్ గా మారారు. శ్రీ సింహ ‘యమదొంగ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించారు. ఆ తరువాత బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ‘మత్తువదలరా’ సినిమాతో ఆయన హీరోగా మారారు.

    శ్రీవల్లి ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక సినిమా నిర్మాణంలో లైన్ ప్రొడ్యూసర్ పాత్ర ఎంతో ఉంటుంది. శ్రీవల్లి ఈగ సినిమా నుంచి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ తరువాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పనిచేశారు. ఇలా శ్రీవల్లి రాజమౌళి సినిమాల్లో కీలకంగా ఉన్నారు. ఒక సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ వదిన మా ఇంట్లో వచ్చాక మా ఆలోచన దృక్ఫథమే మారిపోయిందని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మా అమ్మ తరువాత వల్లమ్మకే నన్ను తిట్టే హక్కు ఉందని అన్నారు. ఇక ప్రభాస్ అయితే తనకు రెండో అమ్మ శ్రీవల్లి అని ఆమెతో సరదాగా గడుపుతుంటాడు. బాహుబలి సమయంలో శ్రీవల్లి చేసిన వంటలన్నీ ప్రభాస్ లాగించేవాడట.. షూటింగ్ లో మాత్రం శ్రీవల్లి చాలా స్ట్రిక్ట్ అంట.. ప్రభాస్, ఎన్టీఆర్ ను సైతం భయపెట్టి మరీ బెదిరించి పని చేయించేదట.. ఇలా శ్రీవల్లి గారు తెర వెనుక ఉండి కీలకంగా వ్యవహరిస్తున్నారు.