Bigg Boss Non Stop OTT : బిగ్ బాస్ అంటేనే ‘మాస్క్ ’ లేకుండా మనం ఉన్నది ఉన్నట్టు చూపించేది. ఇందులో దాపరికాలు ఉండవు. బిగ్ బాస్ ఓటీటీ వచ్చాక 24 గంటల పాటు లైవ్ యాక్షన్ ఇస్తున్నారు. దీంతో ఎవరు ఏం చేస్తున్నారన్నది ప్రేక్షకులందరికీ తెలిసిపోతోంది. ఇన్నాళ్లు గంట మాత్రమే చూపించడంతో ఎవరో ఏమిటో అందరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు 24 గంటల ప్రసారంతో అందరి జాతకాలు బయటపడుతున్నాయి.
తాజాగా బిగ్ బాస్ ఓటీటీ కూడా యమ రంజుగా సాగుతోంది. పాత బిగ్ బాస్ కంటెస్టెంట్లనే ఇందులో పెట్టడంతో ఆట రక్తి కడుతోంది. ఇటీవల బిగ్ బాస్ హౌస్లో స్మోకింగ్ రూం బయటకొచ్చి బాత్రూంలో ఒక కంటెస్టెంట్ స్మోకింగ్ చేయడం దుమారం రేపింది. దీన్ని నాగార్జున ఈ ఆదివారం హైలెట్ చేసి కడిగిపారేశాడు. అందరినీ నిలబెట్టి ఎవరు స్మోకింగ్ చేశారో చెప్పాలని నిలదీశారు.
Also Read: Acharya : ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. మెగా స్టార్ కే అవమానం ఇది !
అంతకుముందు నటరాజ్ మాస్టర్ బాత్రూంలలో స్మోకింగ్ ఎవరో చేశారని.. వాసన కంపుకోడుతోందని బాబా భాస్కర్ తో అంటాడు. అయితే బాత్రూం లోపల ఆ పనిచేయడంతో ఎవరు చేశారన్నది వెలుగులోకి రాలేదు. కెమెరా కంటికి చిక్కలేదు.
దీంతో నాగార్జున అందరినీ నిలబెట్టి మరీ ఎవరు స్మోకింగ్ చేశారో చెప్పమని నిలదీస్తారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయని బెదిరిస్తాడు. కానీ ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా నోరుమెదపరు.
అసలు విషయం ఏంటంటే.. నటరాజ్ మాస్టర్ ముందు బాత్రూం వాడుకున్నది ఓ లేడీ కంటెస్టెంట్. ఆమె ఆషురెడ్డినే. ఆషుకు సిగరెట్ అలవాటు ఉంది. కానీ బహిరంగంగా తాగితే ప్రేక్షకుల దృష్టిలో విలన్ అవుతానని ఇలా బాత్రూంలో కాల్చినట్టుంది.అయితే నాగార్జున ఎవరు కాల్చారని నిలదీసినా ఆషురెడ్డి మాత్రం నోరుమెదపలేదు. కానీ బిగ్ బాస్ కెమెరాలు మాత్రం ఆమెనే చూపించాయి. దీంతో సిగరేట్ బాత్రూంలో కాల్చింది ఆషురెడ్డి అని అందరూ భావించాల్సి వస్తోంది.
Also Read: Nandini Rai: అందాలతో మత్తెక్కిస్తున్న తెలుగు నటి సెల్ఫీ వీడియోలు.. ఇంతకీ ఏం చూపించింది?
Recommended Videos: