Bigg Boss Telugu: విదేశాలలో బిగ్ బ్రదర్ పేరుతో సంచలనం సృష్టించిన రియాలిటీ షో ని ఇండియా లో బిగ్ బాస్ పేరిట గత కొన్నేళ్ల నుండి విరామం లేకుండా నిర్వహిస్తూనే ఉన్నారు..ఎన్డీమోల్ షైన్ సంస్థ ఇండియా లో ఈ రియాలిటీ షో ని నిర్వహించడానికి సర్వ హక్కులను దక్కించుకుంది..ముందుగా ఈ రియాలిటీ షో ని హిందీ లో ప్రారంభించారు..సల్మాన్ ఖాన్ ఈ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు..మొదటి సీజన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అలా రెండు మూడు సీజన్స్ హిట్ అయినా తర్వాత ఎన్డీమోల్ షైన్ సంస్థ ఇతర ప్రాంతీయ బాషలలో కూడా ఈ రియాలిటీ షోస్ ని నిర్వహించడానికి
పూనుకుంది..అందుకోసం పలు టీవీ చానెల్స్ తో అగ్రిమెంట్ కూడా చేయించుకుంది..అలా స్టార్ మా ఛానల్ లో ఆరేళ్ళ పాటు అగ్రిమెంట్ కుదుర్చుకోగా, లేటెస్ట్ గా జరిగిన ఆరవ సీజన్ తో అగ్రిమెంట్ గడువు ముగిసింది..ఇప్పుడు లేటెస్ట్ సీజన్ కోసం స్టార్ మా ఛానల్ ఎన్డీమోల్ షైన్ సంస్థ తో అగ్రిమెంట్ కూర్చుకోవడం కోసం చర్చలు జరుపుతుంది.
ఈ చర్చలు సఫలం అయితే స్టార్ మా ఛానల్ లోనే 7వ సీజన్ కూడా కొనసాగుతుంది..ఒకవేళ సఫలం కాకపోతే జెమినీ టీవీ కి షిఫ్ట్ అవుతుంది అంటూ లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త..స్టార్ మా ఛానల్ లో ఆరవ సీజన్ కి ప్రారంభ ఎపిసోడ్ నుండి ఆశించిన స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ రాలేదు..ఓవరాల్ గా ఈ షో ఫ్లాప్ షో గానే మిగిలింది..అందువల్ల తదుపరి సీజన్ స్టార్ మా ఛానల్ తో ఒప్పందం కుదిరించుకుందామా వద్దా అని ఎన్డీమోల్ సంస్థ ఆలోచిస్తుందట..ఇక నుండి ఈ రియాలిటీ షో జెమినీ టీవీ కి షిఫ్ట్ అవ్వబోతుంది అని కూడా గట్టిగా వినిపిస్తున్న టాక్.

గతం లో కూడా ఇలాగే స్టార్ మా ఛానల్ లో ‘మీలో ఎవరి కోటీశ్వరుడు’ షో టెలికాస్ట్ అయ్యింది..కానీ చివరి సీజన్ ఫ్లాప్ అవ్వడం తో మాటీవీ నుండి జెమినీ టీవీ కి షిఫ్ట్ అయ్యింది..’ఎవరు మీలో కోటీశ్వరుడు’ పేరుతో ప్రసారమైన ఈ షో కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు..ఈసారి బిగ్ బాస్ సీజన్ కూడా అలాగే నిర్వహించేందుకు ఎన్డీమోల్ సంస్థ సన్నాహాలు చేస్తుందట..మరి రాబొయ్యే రోజుల్లో బిగ్ బాస్ సీజన్ స్టార్ మా లో వస్తుందా..లేదా జెమినీ టీవీ లో వస్తుందా అనేది చూడాలి.