Sri Satya- Srihan: బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి ఒక గ్రూప్ గా కలిసి ఆడుతూ వస్తున్న కంటెస్టెంట్స్ శ్రీహాన్ – శ్రీ సత్య – రేవంత్..వీళ్ళ ముగ్గురు ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఇన్ని రోజులు టాస్కులు ఆడుతూ వచ్చారు..ఇన్ని వారాలు హౌస్ లో ఉన్నా కూడా ఎప్పుడు ఒకరి మీద ఒకరు నామినేషన్స్ వేసుకున్న దాఖలాలు లేవు..కానీ గత వారం రోజుల నుండి శ్రీహాన్ మరియు శ్రీ సత్య మధ్య గొడవలు రేగాయి.

టికెట్ 2 ఫినాలే టాస్కు లో సంచాలక్స్ లో ఒకరిగా వ్యవహరించిన శ్రీ సత్య తో శ్రీహాన్ టాస్కు విషయం లో ఒక చిన్న గొడవపడుతాడు..వీళ్ళ మధ్య గొడవలు కొత్తేమి కాదు..కానీ ఎన్నిసార్లు గొడవపడినా వెంటనే కలిసిపోతూ ఉండేవాళ్ళు..కానీ ఈసారి శ్రీ సత్య మాత్రం కాస్త ఎక్కువ చేస్తుంది..బహుశా చివరి వారం లోకి వచేస్తున్నాము..ఇక వీళ్ళతో పనేముంది అనుకుందో ఏమో తెలీదు కానీ శ్రీహాన్ ని మాత్రం బాగా దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంది.
ఇన్ని రోజులు గొడవలు జరిగినప్పుడు రాని కోపం ఇప్పుడు శ్రీ సత్య కి ఎక్కడి నుండి వచ్చిందో అని చూసే ప్రేక్షకులు సైతం అనుకుంటున్నారు..ఇక ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో శ్రీ సత్య శ్రీహాన్ తో గొడవ పడుతూ ఉంది..ముందు గా శ్రీహాన్ మాట్లాడుతూ ‘ నేను తీసుకున్న నిర్ణయం ఎంత కరెక్టో..ఆరోజు నేను అరిచిన దాంట్లో ఏమన్నానో అందరికి తెలుసు’ అంటాడు..అప్పుడు శ్రీ సత్య అందుకే సమాధానం చెప్తూ ‘ ఎవరెవరు ఏమి చర్చించుకున్నారో ఒక్కసారి ఆ వీడియో అడిగితె మీకు స్పష్టం గా అర్థం అవుతుంది’ అని శ్రీహాన్ ని అంటుంది.

అప్పుడు శ్రీహాన్ ‘కెమెరాలతో చెప్పాము అని అనేబదులు ఒకసారి మేము ఏమి మాట్లాడుకున్నామో మీకు చెప్తాము అని ఉంటే అసలు గొడవ అయ్యేది కాదుకదా..పక్కన కూర్చొని ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు మీరు ఆపకపోతే నేను హర్ట్ అయ్యాను’ అంటూ శ్రీహాన్ శ్రీ సత్య తో అంటాడు..ఇన్ని రోజులు ఇనాయ గురించి ఏవేవో చెప్పి ఇప్పుడు ఆమెతోనే మింగిల్ అయ్యిపోయావు అంటూ శ్రీహాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి..ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడొచ్చు.