Nagarjuna- Faima: ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఊహించని ట్విస్టులతో చివరి దశకి చేరుకుంది..ఈ సీజన్ 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అవ్వగా,నిన్న ఫైమా ఎలిమినేషన్ తో 7 మందికి చేరుకుంది..ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి..ఇక ఎలా అయినా టైటిల్ గెలుచుకొని ఇంటికి వెళ్ళాలి అనుకున్న ఫైమా టాప్ 5 లిస్ట్ లోకి కూడా రాకపోవడం గమనార్హం.

సీజన్ ప్రారంభం నుండి మంచి వోటింగ్ తో ప్రారంభమైన ఫైమా బిగ్ బాస్ జర్నీ గ్రాఫ్, క్రమంగా తగ్గుతూ వచ్చింది..గత రెండు మూడు వారాల నుండి అయితే మరింత దారుణంగా ఆమె గ్రాఫ్ పడిపోయింది..ఫలితంగా ఆమె నిన్న ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది..ఫైమా ని ఇంటి సభ్యులందరు సంతోషం గానే పంపారు..ఆది రెడ్డి కాస్త ఎమోషనల్ అయ్యాడు కానీ..స్టేజి మీద కి ఫైమా వచ్చిన తర్వాత ఫుల్ ఫన్ గా కొనసాగిపోయింది.
హౌస్ నుండి బయటకి వెళ్లేటునప్పుడు రేవంత్ ఫైమా చేతి మీద ముద్దు పెడుతాడు..ఆ తర్వాత స్టేజి మీదకి వచ్చాక ఫైమా ఫన్ & ఫ్రస్ట్రేషన్ గేమ్ ఆడిస్తాడు నాగార్జున..ఈ గేమ్ లో ఇంటి సభ్యులందరినీ ఫన్ లిస్ట్ లో వేసి , రేవంత్ ని మాత్రం ఫ్రస్ట్రేషన్ లిస్ట్ లో వేస్తుంది..ఆ తర్వాత రేవంత్ నాగార్జున తో మాట్లాడుతూ ‘సార్..ఫైమా కి చేతి మీద ముద్దు పెడితే అసలు నచ్చదు..చెయ్యి లాగేసుకుంటుంది’ అని అంటాడు..అవునా ఎందుకు అలా అని అడుగుతాడు నాగార్జున..అప్పుడు రేవంత్ ‘తనకి చక్కిలిగింతలు అంట సార్’ అని అంటాడు.

అవునా నేను ట్రై చేస్తా ఉండు అని నాగార్జున ఫైమా చేతులని లాగిమరీ ముద్దు పెట్టుకుంటాడు..హౌస్ మేట్స్ అందరూ షాక్ కి గురి అవుతారు..ఫైమా తొలుత చెయ్యి ఇవ్వడానికి అంగీకరించదు..లాగేస్తూ ఉంటుంది..కానీ నాగార్జున బలవంతంగా లాగి ముద్దు పెట్టుకోవడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.