Bigg boss 6 Telugu Elimination : ఈ వారం డేంజర్ జోన్ లో శ్రీ సత్య – రాజ్.. మరో షాకింగ్ ఎలిమినేషన్ కి సిద్ధం అవ్వాల్సిందేనా!

Bigg boss 6 Telugu Elimination : బిగ్ బాస్ సీజన్ -6 ప్రారంభమై అప్పుడే పది వారాలు పూర్తి చేసుకుంది.. ఈ పది వారాల్లో ఈ సీజన్ లో చోటు చేసుకున్నన్నీ ట్విస్టులు ఇంతకుముందు ఏ సీజన్ లో కూడా జరగలేదు.. గత కొద్ది వారాల నుండి అన్నీ ఊహించని ఎలిమినేషన్స్ చోటు చేసుకున్నాయి..గత వారంలో డబుల్ ఎలిమినేషన్ జరగగా వాసంతి – బాలాదిత్య హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం బిగ్ […]

Written By: NARESH, Updated On : November 14, 2022 8:57 pm
Follow us on

Bigg boss 6 Telugu Elimination : బిగ్ బాస్ సీజన్ -6 ప్రారంభమై అప్పుడే పది వారాలు పూర్తి చేసుకుంది.. ఈ పది వారాల్లో ఈ సీజన్ లో చోటు చేసుకున్నన్నీ ట్విస్టులు ఇంతకుముందు ఏ సీజన్ లో కూడా జరగలేదు.. గత కొద్ది వారాల నుండి అన్నీ ఊహించని ఎలిమినేషన్స్ చోటు చేసుకున్నాయి..గత వారంలో డబుల్ ఎలిమినేషన్ జరగగా వాసంతి – బాలాదిత్య హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేటైనా ఇంటి సభ్యులు శ్రీహాన్ , శ్రీ సత్య, రేవంత్ , కీర్తి, ఇనాయ , మెరీనా , రోహిత్ మరియు ఆది రెడ్డి.. గతవారం ట్రెండ్స్ ను బట్టి చూస్తే అందరికంటే ఎక్కువ ఓట్లతో రేవంత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా రెండవ స్థానంలో ఇనాయ , మూడవ స్థానంలో శ్రీహాన్ కొనసాగుతున్నారు.. అయితే ప్రస్తుతానికి చివరి రెండు స్థానాల్లో శ్రీసత్య , రాజు ఉన్నట్టు తెలుస్తోంది.. స్వల్పమైన ఓట్ల తేడాతో రాజుపై శ్రీ సత్య ఆధిక్యత కనబరుస్తోంది.

శ్రీసత్య టాస్కులు బాగానే ఆడుతున్నప్పటికీ గ్రూప్ సహాయంతోనే ఆమె నెగ్గుకొస్తోంది అనే నెగటివిటీ ప్రేక్షకుల్లో బాగా ఏర్పడింది.. ఈ నెగటివిటీ ఆమెపై ఇప్పట్లో పోయేలా లేదు.. కుర్రకారులో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న శ్రీసత్య మెల్లిమెల్లిగా తన గ్రాఫ్ ని తగ్గించుకుంటూ వెళుతోంది.. గత వారంలో కూడా శ్రీహాన్ తో ‘జనాల దృష్టిలో నువ్వు విన్నర్.. నేను రన్నర్’ అని ఓవర్ కాన్ఫి డెన్స్ తో మాట్లాడడాన్ని కూడా జనాలు తీసుకోలేకపోయారు.. మరోపక్క శ్రీసత్య కారణంగా శ్రీహాన్ గ్రాఫ్ కూడా తగ్గిపోయింది.. నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా రెండో స్థానంలో కొనసాగే శ్రీహాన్.. గత రెండు వారల నుంచి మూడో స్థానానికి పడిపోయాడు.

శ్రీ సత్యతో గ్రూప్ అలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో అతని గ్రాఫ్ మరింత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి..ఇక రాజ్ గ్రాఫ్ మొదటి రోజు నుండి పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గి లేదు.. ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్ లోనే ఉన్నాడు కానీ..రాబొయ్యే రోజుల్లో అతని గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి..సేఫ్ జోన్ లోకి కూడా వెళ్లొచ్చు..కానీ శ్రీ సత్య మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.